MLC Kavitha : ఈడీ అధికారి జోగేంద్రకు కవిత లేఖ.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ..!
NQ Staff - March 21, 2023 / 12:17 PM IST

MLC Kavitha : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మొదటి నుంచి తనపై ఉద్దేశ పూర్వకంగానే బీజీపీ ఆదేశాలతో ఈడీ వేధిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తున్నారు. అరుణ్ రామ చంద్ర పిళ్లై స్టేట్ మెంట్ లో కవిత పేరు చెప్పారని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆమెను ఇప్పటికే రెండుసార్లు విచారించింది.
తాజాగా ఈడీ అధికారి జోగేంద్రకు కవిత ఓ సంచలన లేఖ రాసింది. ఇందులో.. ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరపణను తాను తీవ్రంగా తప్పు బడుతున్నానని పేర్కొంది కవిత. ఈడీ తనపై తప్పుడు ఆరోపణ చేసినా కూడా.. తన బాధ్యతగా తన ఫోన్ ను సమర్పించినట్టు పేర్కాన్నారు కవిత.
కాగా ఒక మహిళ ఫోన్ ను తీసుకోవడం గోప్యత హక్కును హరించడం కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. కనీసం తనను అడగకుండానే ఈ ఆరోపణలు ఎందుకు చేశారంటూ కవిత వాపోయారు. వాస్తవంగా మార్చి నెలలోనే తనను ఈడీ విచారణ కోసం పిలిచిందని.. కానీ నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం వెనక దురుద్దేశం ఉందంటూ చెప్పారు.

MLC Kavitha Wrote Sensational Letter ED Officer Jogender
ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ప్రతిపక్షాలు తనను ప్రజల్లో నిందిస్తున్నారని కవిత పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ఈ రోజు తమ పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గిస్తున్నారని, తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ కవిత సీరియస్ అయ్యారు.

MLC Kavitha Wrote Sensational Letter ED Officer Jogender
నిష్ఫక్ష పాతంగా వ్యవహరించాల్సిన ఈడీ ఇలా తప్పుడు ఆరోపణలతో విధిని మరిచిపోవడం దురదృష్టకరం అంటూ కవిత వ్యాఖ్యానించారు. ఇక ఈరోజు మరోసారి ఆమెను ఈడీ విచారంచబోతోంది. ఈ సారి కీలక విషయాలపై ఈడీ విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.