MLC Kavitha : ఎన్నిసార్లు విచారణకు పిలిచినా పోతా : కవిత
NQ Staff - March 15, 2023 / 04:51 PM IST

MLC Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ముందు మరోసారి విచారణకు హాజరు కాబోతుంది. తనను రాజకీయంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఎదుర్కొలేక కేసులు బనాయిస్తున్నట్లుగా కవిత విమర్శించింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు విఫలమైందని, దాన్ని జాతీయ స్థాయిలో చూపించేందుకు ప్రయత్నిస్తున్న తమపై కుట్రలు చేస్తున్నారంటూ కవిత ఆరోపించారు.
మహిళా బిల్లు పై పార్లమెంటులో ఒత్తిడి తెస్తామని ఆమె పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందే వరకు పోరాటం ఆగదని తమతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా కలిసి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇక ఈడీ తనను ఎన్నిసార్లు విచారణకు పిలిచిన కూడా వెళ్లేందుకు సిద్ధమని కవిత పేర్కొన్నారు. తనను కేసులో రాజకీయ కారణాల వల్లే ఇరికించారంటూ ఆరోపించింది. ప్రస్తుతం ఈడీ రెండో దఫా విచారణకు కవిత సిద్ధమవుతున్నారు.