MLC Kavitha : ఎఫ్‌ఐఆర్ లో నా పేరు లేదు : ఎమ్మెల్సీ కవిత
NQ Staff - December 5, 2022 / 11:49 AM IST

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సిబిఐ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఆ నోటీసులకు సమాధానంగా కవిత తనకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాలని విజ్ఞప్తి చేసింది.

MLC Kavitha Response To Matters Related To Copy Of FIR
దానికి సిబిఐ వారు సమాధానం ఇచ్చారు. ఆమెకు ఎఫ్‌ఐఆర్ కాపీ కి సంబంధించిన విషయాలను కూడా తెలియజేశారు. ఎఫ్ ఐ ఆర్ కాపీ చూసిన తర్వాత కవిత స్పందిస్తూ.. సిబిఐ తన వెబ్సైట్లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్ణంగా పరిశీలించాము.

MLC Kavitha Response To Matters Related To Copy Of FIR
అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూసాము, దానిలో నా పేరు ఎక్కడ లేదు. ఈ కేసులో క్లారిటీ కోసం సిబిఐ వారి యొక్క ఎఫ్‌ఐఆర్ చూడడం జరిగింది. అందులో ఎక్కడా కూడా నా పేరు లేదు.

MLC Kavitha Response To Matters Related To Copy Of FIR
అయినా కూడా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈనెల 6వ తారీఖున ముందుగా కమిట్ అయిన కొన్ని కార్యక్రమాలు ఉన్న కారణంగా 11, 12, 14, 15 తేదీల్లో ఇంట్లో సమావేశానికి అందుబాటులో ఉంటాను. కనుక మీరే ఒక తేదీని నిర్ణయించి రావచ్చు అంటూ పేర్కొంది. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని.. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కూడా కవిత పేర్కొన్నారు.