MLC Kavitha : షర్మిలపై కవిత సెటైర్ : బాణం.! తామర పువ్వుల సంబరం.!
NQ Staff - November 30, 2022 / 10:15 AM IST

MLC Kavitha : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై ‘బాణం’ అంటూ సెటైరేశారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
‘నేను జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ గతంలో వైఎస్ షర్మిల, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా నినదించిన విషయం విదితమే. అయితే, ఇప్పుడు వైఎస్ షర్మిలను బీజేపీ వదిలిన బాణంగా కవిత అభివర్ణిస్తున్నారు.
ఇంతకీ బాణాన్ని ఎవరి సంధించినట్టు.?
సొంత రాజకీయ పార్టీ పెట్టుకుని, తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ షర్మిల. ఆమె అనుకున్నది సాధిస్తారా.? లేదా.? అన్నది వేరే చర్చ. తెలంగాణ రాజకీయాల్లో ఇంతవరకు ఏ మహిళా చేయనంత స్థాయిలో సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. నిజానికి, దేశంలోనే ఏ మహిళ కూడా ఈ స్థాయిలో పాదయాత్ర చేసింది లేదు.
సాటి మహిళని ఉద్దేశించి ‘బాణం’ అంట వెటకారం చేయడమేంటో మరి.? అన్న విమర్శ కవితపై వినిపిస్తోంది. కాగా, ‘తాము వదిలిన బాణం తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు..’ అంటూ కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించడం వైరల్ అవుతోంది.
మరి, కవిత సెటైర్ మీద బీజేపీ ఎలా స్పందిస్తుందో.. వైఎస్ షర్మిల ఎలా స్పందిస్తారో.?