MLC counting : ఫ్లాష్.. ఫ్లాష్.. : పల్లా రాజేశ్వర్ రెడ్డి వరుసగా రెండో సారి విజయం

MLC counting : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తన సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోగా అధికార పార్టీ టీఆరెస్ మాత్రం నిలబెట్టుకుంది. గులాబీ పార్టీ శాసన మండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై నెగ్గారు. దీంతో రెండు పట్టభద్ర నియోజకవర్గాలూ కారు పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఫస్ట్ రౌండ్ నుంచీ మెజారిటీ ప్రదర్శించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అదే ఆధిక్యాన్ని చివరి రౌండ్ వరకు కొనసాగించి పట్టు నిలుపుకున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మరోసారి నిలిచినప్పటికీ రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలను రాష్ట్ర ప్రజలు గుర్తించారు. తెలంగాణ జన సమితి పార్టీ తరఫున పోటీ చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ మూడో స్థానానికి పరిమితం కాగా బీజేపీ ఘోరంగా నాలుగో ప్లేసుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

MLC counting : trs sitting mlc rajeshwar reddy second time victory
MLC counting : trs sitting mlc rajeshwar reddy second time victory
Advertisement