ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఉగ్రవాదుల నుండి ముప్పు

Advertisement

హైదరాబాద్ నగరంలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉగ్రవాదుల నుండి ముప్పు ఉందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. అయితే ఈ విషయాన్నీ సీపీ అంజనీ కుమార్ లేఖ ద్వారా రాజాసింగ్ కు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు తన నివాసం వద్ద భారీగా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపాడు.

అలాగే ఆయన తన సొంత బుల్లెట్‌ బైక్ పై తిరగడం మానుకోవాలని సీపీ, రాజాసింగ్ కు సూచించాడు. ఎమ్మెల్యేకు సరైన భద్రతను కల్పించడం తమ భాద్యత అని అన్నారు. తనకు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో భద్రతను పెంచుతున్నట్లు పేర్కొన్నాడు. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మీ వ్యక్తిగతసెక్యూరిటీ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఆ లేఖలో సీపీ అంజనీ కుమార్ వెల్లడించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here