MLA Rajani : 2014-15లో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ నాయకత్వ బాధ్యతలనుంచి వైదొలగడంతో కోహ్లీ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఆపై రెండేళ్లకు పరిమిత ఓవర్ల సారథ్య బాధ్యతలను కూడా వదులుకోవాలని మహీ నిర్ణయించుకోవడంతో 2017లో విరాట్ అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కోహ్లీ పగ్గాలు చేపట్టాక అతిపెద్ద టోర్నీ చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో దాయాది పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయింది.

సారథిగా ధోనీకంటే కోహ్లీకే విజయశాతం మెరుగ్గా ఉండడం విశేషం. విరాట్ సారథ్యంలో భారత్ 45 టీ20 మ్యాచ్‌ల్లో తలపడితే 27 విజయాలు సాధించింది. 2 మ్యాచ్‌లు టై కాగా.. మరో రెండు ర ద్దయ్యాయి. అంటే.. 65.11 శాతం అన్నమాట. విరాట్ నాయకత్వంలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేకపోయినా.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లలో జట్టు సిరీస్‌లు గెలుచుకోవడం విశేషం.
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ విషయం తెలుపుతూ ఆయన ట్విట్టర్లో ఒక మేసేజ్‌ను షేర్ చేశాడు. అంతకు ముందు వన్ డే, టీ-20 క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాభవం ఎదురు కావడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
విరాట్ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీ ప్రకటనపై ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విడదల రజిని ఎమోషనల్ అయ్యారు. విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి వార్తను కచ్చితంగా ఇప్పుడు తాము వినాలనుకోలేదని ఎమ్మెల్యే విడదల రజిని అభిప్రాయపడ్డారు. కానీ కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు.
భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అందించిన సేవలకు ఎమ్మెల్యే విడదల రజిని ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో విరాట్ కోహ్లీ భారత జట్టులో కీలక ఆటగాడిగా బాగా రాణించాలని.. సెంచరీల మీద సెంచరీలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే రజిని ట్వీట్ చేశారు. కాగా, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టెస్టులకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ అకస్మాత్తుగా ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు.