MLA Karanam Dharmasri : ఉగాది నుండి ఏపీకి కొత్త రాజధాని అందుబాటులోకి
NQ Staff - January 24, 2023 / 02:05 PM IST

MLA Karanam Dharmasri : ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా విశాఖ పట్నం మారబోతుంది అంటూ వైకాపా నాయకులు పదే పదే చెబుతున్నారు. ఇటీవలే ఓ మంత్రి రాబోయే రెండు నెలల్లో వైజాగ్ నుండి ఏపీ పరిపాలన కొనసాగబోతుంది అంటూ ప్రకటించిన విషయం తెల్సిందే.
తాజాగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరో అడుగు ముందుకు వేసి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందని పేర్కొన్నాడు. ఏపీ రాజధాని గా వైజాగ్ లో ఉగాది నుండి పరిపాలన కొనసాగబోతుంది అంటూ ఆయన ప్రకటించాడు.
రాజధాని విషయం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం అని భారత రాజ్యాంగం చెబుతుంది. అందుకే కచ్చితంగా వచ్చే ఉగాది నుండి విశాఖ పట్నం నుండి జగన్ పరిపాలన కొనసాగించబోతున్నాడు అంటూ ఆయన పేర్కొన్నాడు.
తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకులు రాష్ట్ర అభివృద్దిని మరియు ఉత్తరాంధ్ర యొక్క అభివృద్దిని అడ్డుకుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది లేక ఉత్తరాంధ్ర ఏళ్లుగా అవస్తలు పడుతుంది. రాజధానిగా వైజాగ్ అయితే ఉత్తరాంధ్ర యొక్క రూపు మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు.