జగన్ కు లేఖ రాసిన బాలయ్య

Advertisement

నందమూరి నటసింహం బాలయ్య కేవలం సినిమాల్లోనే కాదు ఇటు రాజకీయాల్లో కూడా తన సత్త ఏంటో చాటుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. అయితే తన నియోజకవర్గం ప్రజా సమశ్యల పైన ఆయన వంతు కృషి చేస్తూ ఉంటాడు. అయితే మొదటి నుండే అధికార పార్టీ అంటే అయిష్టత చూపెటువంటి బాలయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ కి ఒక లేఖ రాయడం జరిగింది.

అయితే ఆ లేఖ దేని గురించి రాసాడు అన్న పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ ప్రస్తుతం ముఖ్యంగా రెండు విషయాల పైన బాగా శ్రద్ధ చూపిస్తూ వెళ్తున్నారు వాటిల్లో ఒకటి విద్య మరొకటి వైద్యం దానిలో భాగంగానే ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజీను ఏర్పాటు చేసేందుకు ప్రణాలికలు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఆలా అనంతపురం కి ఒక మెడికల్ కాలేజీ ని ప్రకటించగా ఇదివరకే అక్కడ ఒక మెడికల్ కాలేజీ ఉండడంతో అక్కడి స్థానికులు పెట్టబోయే మెడికల్ కాలేజీని హిందూపురం లో పెట్టాలన్న నిర్ణయం తెలపడం జరిగింది.

కేవలం స్థానికులు మాత్రమే కాకుండా హిందూపురం ఎంఎల్ ఏ అయినటువంటి బాలయ్య బాబు కూడా హిందూపురంలోనే ఆ పెట్టబోయే కాలేజీ ని ఏర్పాటు చేయించాలని మొదటి నుండి అనుకుంటున్నాడు. కానీ దానికి అడ్డుగా మెడికల్ కాలేజీని పెనుగొండలో ఏర్పాటు చేయాలని మంత్రి శంకర నారాయణ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆలా శంకర నారాయణ ప్రయత్నాలకు జగన్ మరియు అక్కడి ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపిందన్న వార్తలు బయటకు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here