YS Sharmila : షర్మిల కారు ఎక్కడంతో కానిస్టేబుల్ కాలికి గాయాలు.. మరో రెండు సెక్షన్లు నమోదు..!

NQ Staff - April 24, 2023 / 02:41 PM IST

YS Sharmila : షర్మిల కారు ఎక్కడంతో కానిస్టేబుల్ కాలికి గాయాలు.. మరో రెండు సెక్షన్లు నమోదు..!

YS Sharmila  : ఈ రోజు లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్తత గురించి తెలిసిందే. షర్మిలను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించారు. కారుకు పోలీసులు అడ్డంగా రావడంతో ఆమె కారులో నుంచి వేగంగా దిగి వచ్చి ఎస్సై మీద చేయి చేసుకోబోయారు. అనంతరం ఆయన్ను నెట్టేశారు.

ఒక మహిళా కానిస్టేబుల్ ను కూడా నెట్టేశారు. అదే సమయంలో ఆమె కారును ఆపకుండా ముందుకు వెళ్లడంతో కారు ముందు నిలబడ్డ కానిస్టేబుల్ గిరిబాబు కాలిమీద నుంచి కారు టైర్ వెళ్లింది. దీంతో ఆయన్ను స్టార్ ఆస్పత్రిలో చేర్పించి స్కానింగ్ తీయగా.. కాలి లిగ్మెంట్ కు గాయం అయినట్టు వైద్యులు తెలిపారు.

పోలీసులపై దురుసగా ప్రవర్తించిన కారణంగా షర్మిలపై 337,రెడ్ విత్ 34 కింద మరో రెండు సెక్షన్లు నమోదు చేశారు. ఇక వైఎస్ విజయమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న షర్మిలను చూసేందుకు వచ్చిన విజయమ్మ.. అక్కడ మహిళా కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నారు.

 Misbehaved With Police Came Stop YS Sharmila

Misbehaved With Police Came Stop YS Sharmila

ఒకే రోజు విజయమ్మ, షర్మిల ఇలా దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పోలీసులను కొట్టడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇక పోలీసులను కొట్టిన విషయంపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us