Minister Vellampalli: సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఓ పెద్ద సన్నాసి : మంత్రి వెల్లంపల్లి

Minister Vellampalli: తెలుగు సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలు, సోషల్ మీడియా.. ఇలా ఎక్కడ చూసినా ప్రస్తుతం ఒకటే టాపిక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆన్ లైన్ సినిమా టికెట్ వివాదం దుమారం రేపుతోంది.

Minister Vellampalli Sensational Comments on Pawan Kalyan
Minister Vellampalli Sensational Comments on Pawan Kalyan

ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జగన్ సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ క్రమంలో ఏపీలో పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకునే ప్రయత్నాన్ని ఆపుకోవాలన్నారు. సినిమా వాళ్ళు ఎవర్ని దోచుకుని సంపాదించడం లేదని అన్నారు. మేము డాన్సులు చేసో, ఫైటింగ్ లు చేసో కాళ్ళు, చేతులు విరగొట్టుకుని కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయని.. ప్రజలు తమని ఆధరిస్తున్నరని అన్నారు. అలాగే సినిమాల టికెట్లు ప్రభుత్వం చెంతకు చేరితే సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు.

అందుకే ఏ విషయాన్ని తెగే వరకు లాగకూడదన్నారు. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకు వ్యాపారాలు ఉండకూడదా అని ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వం నిధులు హరించుకుపోయాయని, అందుకే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మేందుకు ముందుకు వచ్చిందని అన్నారు. సినీ ఇండస్ట్రీతో వచ్చే డబ్బును బ్యాంకులకు చూపించి లోన్లు తీసుకుంటుందని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు.

సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ను మించిన పెద్ద సన్నాసి ఇంకెవ్వరూ లేరని మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ సున్నా అంటూ వ్యాఖ్యానించారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన నటనలో భాగంగా పవన్ కళ్యాణ్ 25 శాతం కూడా చేయలేరని కామెంట్ చేశారు. ఈ క్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ కి సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వస్తున్నాయి.