Minister SekharBabu Naidu: మంత్రి కూతురితో ప్రేమాయ‌ణం.. ప్రాణ హాని ఉంద‌ని డ్రైవ‌ర్ సెల్ఫీ వీడియో

Minister SekharBabu Naidu: ఇడియ‌ట్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. క‌మీష‌న‌ర్ కూతుళ్ల‌కి మొగుళ్లు రారా అని ర‌వితేజ చాలా వీరావేశంతో డైలాగ్స్ చెబుతాడు. కమీష‌న‌ర్ కూతురిని కానిస్టేబుల్ కొడుకు ప్రేమించాడ‌ని అత‌డిపై దాడి చేయిస్తాడు. అయిన‌ప్ప‌టికీ చివర‌కు క‌మీష‌న‌ర్ కూతురినే పెళ్లి చేసుకొని త‌న ప్రేమ గ‌ట్టిద‌ని నిరూపిస్తాడు.

Minister SekharBabu Naidu Daughter's Lover complain that he has threaten from him
Minister SekharBabu Naidu Daughter’s Lover complain that he has threaten from him

ఇప్పుడు ఇదే రీతిలో ఓ మంత్రి కూతురితో డ్రైవర్ ప్రేమ వ్యవహారం నడిపిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. మంత్రి శేఖర్ బాబు కూతురును డ్రైవర్ సతీష్ కుమార్ ప్రేమించాడు. కొన్నాళ్లపాటు సాగిన వీరి ప్రేమ వ్యవహారం చివరకు మంత్రికి తెలిసింది. దీంతో మంత్రి ఆగ్రహంతో డ్రైవర్ సతీష్ ను కొట్టించినట్లు తెలుస్తోంది.

Minister SekharBabu Naidu Daughter's Lover complain that he has threaten from him
Minister SekharBabu Naidu Daughter’s Lover complain that he has threaten from him

త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని తెలిసి డ్రైవ‌ర్ స‌తీష్ ఓ సెల్ఫీ వీడియో విడుద‌ల‌చేశారు. ”మంత్రి కూతురు నేను ఆరేళ్లు ప్రేమించకున్నాం. మంత్రి శేఖర్ బాబు మా పెళ్లికి ఒప్పుకోవడంలేదు. మా కుంటుంబ సభ్యులను పోలీసులతో కొట్టించారు. ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. మంత్రి నుంచి నాకు ప్రాణహానీ ఉంది” అంటూ ఓ వీడియోలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. అమ్మాయి తను బతకడానికి తన తండ్రి సంపాదనలో,ఆస్థిలో నయాపైసా అడగకూడదు.తను సోంతంగానే సంపాదించి బతకాలి.అలా అయితేనే వారిది ట్రూ లవ్ . .లేదంటే వారిది టైంపాస్ లవ్వే నాటి పిల్లలు లవ్ పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.