Minister RK Roja Serious On Pawan Kalyan Comments : పవన్ వల్ల ఎంత మంది అమ్మాయిలు మిస్ అయ్యారో తేలాల్సిందే.. మంత్రి రోజా ఫైర్.. !

NQ Staff - July 28, 2023 / 06:17 PM IST

Minister RK Roja Serious On Pawan Kalyan Comments : పవన్ వల్ల ఎంత మంది అమ్మాయిలు మిస్ అయ్యారో తేలాల్సిందే.. మంత్రి రోజా ఫైర్.. !

Minister RK Roja Serious On Pawan Kalyan Comments :

ఏపీ మంత్రి రోజా గురించి తెలియని వారు లేరు. ఫైర్ బ్రాండ్ గా ఈమె పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం రోజా పర్యాటక శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఈమె తాజాగా శుక్రవారం రోజు మీడియాతో అనంతపురంలో మాట్లాడుతూ పవన్ పై మరోసారి ఫైర్ అయ్యారు.. పవన్ కళ్యాణ్ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారో తేలాల్సిందే అని ఈమె చెప్పుకొచ్చారు.

ఏపీలో మహిళల మిస్సింగ్ పై ఏ నిఘా సంస్థ పవన్ కళ్యాణ్ కు సమాచారం ఇచ్చిందో బయట పెట్టాలని డిమాండ్ చేసారు.. వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరులో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కలకలం రేపుతూనే ఉన్నాయి.. మహిళల అక్రమ రవాణాలో వాలంటీర్లు దోహద పడుతున్నారు అని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలంతా ఫైర్ అవుతున్నారు.

తాజాగా ఏపీ మంత్రి రోజా కూడా తీవ్ర విమర్శలు చేసారు. ఈ వ్యాఖ్యలపై మహిళ వాలంటీర్లు విజయవాడ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేసారు.. పవన్ వ్యాఖ్యలు తమ పరువును భంగం కలిగించేలా ఉన్నాయని పిటిషన్ దాఖలు చేసారు. ఈ క్రమంలోనే రోజా కూడా పవన్ పై వ్యాఖ్యలు చేసింది. ఈయన వ్యాఖ్యలపై రోజా సీరియస్ అయ్యింది.

అలాగే చంద్రబాబుపై కూడా ఈమె ఫైర్ అయ్యింది. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని.. ఈయన రాయలసీమలో పుట్టి అక్కడి ప్రజల ఆశీర్వాదం వల్ల గెలిచి రాయలసీమలో ఏ ఒక్క మంచి పని చేయలేదని ఒక్క ప్రాజెక్టును కూడా ఆయన పూర్తి చేయలేదని రాయలసీమ ప్రోజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఈమె ఆరోపించింది..

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us