కేంద్ర మంత్రి రాజ్ నాథ్ కు మంత్రి కేటీఆర్ లేఖ

Advertisement

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా దృష్ట్యా హైదరాబాద్ నగరంలో కొన్ని కంటైన్మెంట్ ప్రాంతాలు ఏర్పాటు చేసారు ప్రభుత్వ అధికారులు. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో మూసివేసిన రోడ్లను తెరవాలని ఆ లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మంత్రి కేటీఆర్ కోరారు. అలాగే కంటోన్మెంట్ గా ఏర్పాటు చేసిన ప్రాంతంలో రోడ్లు మూసివేసి ఉండడం వల్ల హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో రాశాడు. సికింద్రాబాద్ పరిధిలో ఉన్న కంటైన్మెంట్ ప్రాంతాలలో సైనిక అధికారులు మున్సిపల్ ప్రొటోకాల్‌ను పాటించడం లేదని వెల్లడించారు. ఈ విషయం పై కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించాలని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here