Minister KTR : హైదరాబాద్ మెట్రో పొడగింపు.. ఎయిర్ పోర్ట్ కు ప్రయాణం మరింత సులభం
NQ Staff - November 27, 2022 / 07:45 PM IST

Minister KTR : హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణం ట్రాఫిక్ కష్టాలను తీర్చి వేసింది. మెట్రో రైలు యొక్క ప్రయాణం తో చాలా లాభాలు ఉన్నాయంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొదట్లో మెట్రో రైలు ప్రయాణం కు జనాలు ఒకింత వెనకాడినా కూడా ఇప్పుడు ప్రతి రోజు లక్షల్లో హైదరాబాద్ ప్రజలు మెట్రో రైల్ ప్రయాణం చేస్తున్నారు. దాంతో మెట్రో రైల్ ప్రాజెక్ట్ మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ప్రయాణం కొనసాగించేందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 9వ తారీఖున మైండ్ స్పేస్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రయాణం ఉండే విధంగా కొత్త రూటుకి శంకుస్థాపన చేయబోతున్నారు.
6,250 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కొత్త మెట్రో లైన్ పొడగింపు ప్రాజెక్టు ను చేపట్టబోతున్నట్లుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ కి ఇదో అద్భుతమైన హారం మాదిరిగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. దాదాపుగా 31 కిలో మీటర్ల మేరకు ఈ మెట్రో లైన్ ఉంటుందని అంటున్నారు.
Another milestone in #Hyderabad!
CM #KCR TO lay the foundation for 31KM Long airport express metro starting at Mind space junction to shamshabad airport on 9th December
The proposed budget for project is ₹6,250 CR@KTRTRS @KTR_News @TelanganaCMO pic.twitter.com/jCe5TwoEZ7
— Qube TV (@qubetvnews) November 27, 2022