Kishan Reddy : విజృంభిస్తున్న కరోనా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి పాజిటివ్
NQ Staff - January 20, 2022 / 04:08 PM IST

Kishan Reddy : కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. . రోజురోజుకీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగుతున్నాయి. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య రెండున్నర లక్షలు దాటేసింది. సామాన్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Minister Kishan Reddy tested covid positive
ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. బుధవారం నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని రకాల ప్రోటోకాల్స్‌ని ఫాలో అవుతున్నాను. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నాతో సన్నిహితంగా ఉన్న వారంతా ఐసోలేషన్‌లోకి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి అంటూ రాసుకొచ్చారు.
కిషన్ రెడ్డికి కోవిడ్ టెస్టులు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలున్నట్లు వెల్లడించారు. ఇక కిషన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్‌కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని అన్న అంటూ కామెంట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కిషన్ రెడ్డి త్వరగా కరోనా నుంచి పూర్తిగా కోలుకావాలని కోరుతూ పోస్ట్ చేశారు.
దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర కల్చర్ అండ్ టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల కీలక సూచనలు చేశారు. భారత ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ ప్రోటోకాల్‌పై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ముఖ్యంగా RT-PCR పరీక్షలను వేగవంతం చేయడం, నాన్ సీరియస్ కేసుల కోసం హోమ్ ఐసోలేషన్‌పై దృష్టి పెట్టడం, టెలికన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్, ఈసంజీవని ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు.