Minister Indrakaran Reddy : పేపర్ లీకేజ్ లో కేటీఆర్ దోషి అనడం ఎంత వరకు సబబు
NQ Staff - March 21, 2023 / 08:02 PM IST

Minister Indrakaran Reddy : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ మొత్తం లీకేజీ వెనుక అధికార పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు.
రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ ఇటీవల ఈ విషయమై మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కి లీకేజీ వ్యవహారంలో హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలిసే అన్ని జరుగుతున్నాయి అని కూడా వారు అనుమానం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ విమర్శలపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పేపర్ లీకేజీ అనేది సాధారణంగా జరిగే విషయం ఇంటర్ పదో తరగతి పరీక్ష పేపర్లు లీకైన సందర్భాలు చాలా ఉన్నాయి.
కేటీఆర్ పై వారు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలంటూ ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరో చేసిన తప్పుకి మంత్రి కేటీఆర్ ని దోషి అనడం ఎంత వరకు సబబు అంటూ మంత్రి ప్రతిపక్ష పార్టీల నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలోనే దోషులకు శిక్ష పడుతుందని.. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని ఆయన హామీ ఇచ్చాడు.