మంత్రి హరీష్ రావు మంచితనం

Advertisement

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యలు తన్నీరు హరీష్ రావు పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులతో కలసి సిద్ధిపేట లోని తన నివాసం లో అల్పాహారం భుజించారు. అయితే హరీష్ రావు.. ఏన్నాళ్ళుగా మొక్కలు నాటుతున్నారు అసలు మొక్కలు నాటాలి అని ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అని రామయ్యను అడిగాడు. దీనికి వనజీవి రామయ్య సమాధానము ఇస్తూ.. నా చిన్న తనం నుండి మొక్కలు అంటే ఇష్టమని, చిన్న తనం నుండే మొక్కలు నాటుతున్నాని అన్నాడు. అలాగే చెట్ల ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పూలు, పండ్లు, ఔషదాలు మరియు ముఖ్యంగా స్వచ్ఛమైన ఆక్సిజన్ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అందుకోసమే మొక్కలు నాటుతున్నాని వనజీవి రామయ్య అన్నాడు.

అలాగే మీ బ్రతుకు తెరువు ఎలా అని మంత్రి అడగగా.. తాజాగా వ్యవసాయం చేస్తే నష్టపోయామని, దీనితో మా కొడుకు మమ్మల్ని చూసుకుంటున్నడని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు కోటి పైన మొక్కలు నాటామని.. ఇంకా మూడు కోట్ల మొక్కలు నాటలని సంకల్పం పెట్టుకున్నమని.. చెట్టు కన్నతల్లి లాంటింది అని అన్నాడు. చేపను బయటకు తీయడానికి గాలం వేసినట్టు, భూమిలోని పండ్లను బయటికి తీయడానికి మొక్క నాటలి అని తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ విధ్వంసం పరుగులు తీస్తోందని ఆయన తెలిపారు. వనజీవి రామయ్య మాటలు విని హరీష్ రావు ఆనందం వ్యక్తం చేసాడు. అలాగే ప్రజాప్రతినిధులు అందరు కూడా వనజీవి రామయ్య ను ఆదర్శంగా తీసుకోని మొక్కలు నాటాలని సూచించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here