ఎగిరెగిరిపడే ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ కి మైండ్ బ్లౌయింగ్ న్యూస్ ఇది !

జగన్ అధికారంలోకి వచ్చాక అవినీతి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవాడైన కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఈ నేపథ్యంలోనే గ్యాంబ్లింగ్‌ విషయంపై ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక క‌డ‌ప మేనేజ‌ర్ మ‌ద్దిప‌ట్ల ర‌ఘునాథ‌నాయుడిని అరెస్ట్ చేసారు. ఎంతో బాధ్యతాయుతమైన పని చేస్తూ అసంఘిక కార్యక్రమాలు చేయడంపై మండిపడుతున్నారు ప్రజలు. ప్రశ్నించే హక్కు మాకు ఉంది అని చెప్పే జర్నలిజంకు మాయని మచ్చ తెచ్చాడు కడపకు చెందిన ఆంధ్రపత్రిక దినపత్రిక మేనేజర్ అయిన రఘునాధనాయుడు. ఈయనతో పాటు మ‌రో ఐదుగురిని కూడా పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.

abn kadapa manager

వివరాలలోకి వెళితే క‌డ‌ప న‌గ‌రం చిన్న‌చౌక్‌ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని, ప‌క్కీర్‌ప‌ల్లి  తూర్పు వైపు స‌మాధుల ప‌క్క‌న ఉన్న కంప చెట్ల‌లో ఆరుగురు వ్య‌క్తులు పేకాట ఆడుతున్న స‌మాచారం ఎవరో గాని పోలీసులకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న చిన్న‌చౌక్ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్ఐ స‌త్య‌నారాయ‌ణ‌ మరియు ఇతర పోలీసు సిబ్బందితో క‌లిసి వెళ్లి అక్కడ దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతూ ఆరుగురు వ్యక్తులు ప‌ట్టుబ‌డ్డారు. పోలీసుల‌కు చిక్కిన ఆ ఆరుగురు వ్యక్తులలో ఆంధ్ర‌జ్యోతి క‌డ‌ప మేనేజ‌ర్ ర‌ఘునాథ‌నాయుడు కూడా ఉండ‌డం మీడియా స‌ర్కిల్స్‌లో సంచలనం అయింది. అంతేకాదు నిందితుల దగ్గర నుండి రూ.14 వేల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రఘునాథ నాయుడు గ‌త కొంత కాలంగా ఆంధ్ర‌జ్యోతి పేపర్ ను అడ్డుపెట్టుకుని పలు గ్యాంబ్లింగ్‌ చర్యలను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి.

చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెకు చెందిన ఇత‌ను ఉద్యోగ నిర్వ‌హ‌ణ‌లో భాగంగా చాలారోజులపాటు క‌డ‌ప‌లోనే ఉంటున్నాడు ఆంధ్ర‌జ్యోతిని అడ్డుపెట్టుకుని ఇటు రాజ‌కీయ నేత‌లు, అటు పోలీసు అధికారుల‌తో సమన్వయం కుదుర్చుకుని అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు క‌డ‌ప‌లో జ‌ర్న‌లిస్టులు అప్పట్లో అన్నారు. కానీ అప్పుడు నిందితుడు తప్పు చేస్తున్నట్లు సాక్షాలు లేని కారణంగా ఏమి చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ పాల‌న‌లో అత‌ను రెడ్ హ్యాండెడ్ గా పోలీసుల‌కు చిక్కి జైలుకు వెళ్ళాడు.. !

Advertisement