యువకుడి పొట్టలో మధ్యం తయారీ

Advertisement

యువకుడి పొట్టలో మద్యం తయారీ. వినడానికి వింతగా ఉన్న ఇది నిజంగానే జరిగింది. అసలు పొట్టలో ఏంటి మద్యం తయారీ ఏంటి అని అనుకుంటున్నారా…? దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే

అమెరికా లోని న్యూజెర్సీ లో డేనీ అనే వ్యక్తి రోజు లాగే ఒక రోజు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడి పోలీస్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించగా దానిలో డేనీ బాగా మద్యం సేవించినట్లుగా నమోదు అయ్యింది. దాని తో ఒక్క సారిగా షాక్ అయిన డేనీ నేను మద్యం ఏమి సేవించలేదు కావాలంటే వాసన చూడండి అంటూ చెప్పుకొచ్చాడు. వాసన చూయిమ్ గమ్ లాంటిది నమిలిన పోతుంది అని పోలీస్ లు బదులివ్వడం తో… డేనీ కావాలంటే మరల చెక్ చేయండి అనగా అలా నాలుగు సార్లు చెక్ చేసినప్పటికి అతనికి ఎంతగానో తాగినట్టే ఆ మశిన్ లో రికార్డు కావడం జరిగింది. దాని తో పోలీస్ లు అతనిని అరెస్ట్ చేసి జైలు కు తీసుకెళ్లారు.

డేనీ మాత్రం నేను తాగలేదు అనే పదే పదే చెప్పడం తో నిజంగా తాగాడా లేదో తెలుసుకోవాలని పోలీస్ లు అక్కడికి డాక్టర్ ని పిలిచి అతనికి పరీక్షలు నిర్వహించగా డాక్టర్ అతనిని పరీశిలించి డేనీ తాగలేదు అంటూ తేల్చాడు. దానితో పోలీస్ లు బిత్తరపోయి మరీ ఎందుకు మెషిన్ అలా చూపిస్తుంది అని డాక్టర్ ని ప్రశ్నించగా. వారు ఊహించని సమాధానం వారికి అందింది.

డేనీ కడుపులో మద్యం తయారవుతుంది. అందుకే మీకు అలా చూపించింది. పొట్టలో బీర్ తయారవ్వడం కొంతమందిలో కామనే, దీన్ని ఆటో బ్రూవరీ సిండ్రోం abv అంటారు. డేనీ లాంటి వ్యక్తులు ఆహరాలు అయినటువంటి కేకులు, పిజ్జాలు, బ్రెడ్ ల వంటివి తిన్నప్పుడు వాటిలో ఉన్న కార్బో హైడ్రేట్స్ ఆల్కహాల్ గా మారుతాయి అంటూ తెలిపాడు ఆ డాక్టర్. దాని తో డేనీ ఇక నుండి ఎక్కువ కార్బో హైడ్రేట్స్ ఉన్న ఆహార పదార్థాలను అస్సలు తీసుకొను. వాటికి బదులు గా మాంసం, ఆకు కూరలు, చేపలు తింటానని పోలీస్ లకు చెప్పగా వారు అతనిని విడుదల చేయడం జరిగింది.

మొత్తానికి ఇలా డేనీ వల్ల కొంత మందిలో అనగా abv డిసార్డర్ ఉన్న వారి కడుపులో కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులోనే ఆల్కహాల్ తయారవుతుంది. అన్న విషయం బయటకు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here