Talibans: ఇదెక్క‌డి అరాచకం: అమ్మాయిలు, అబ్బాయిల మ‌ధ్య ప‌రదా క‌ట్టిన తాలిబ‌న్స్

Talibans:అఫ్ఘనిస్తాన్.. ప్రస్తుతం ఈ పేరు చెబితేనే అక్కడి ప్రజల్లో వణుకు పుడుతోంది. తాలిబన్లు ఎప్పుడు ఏం చేస్తారో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ముష్కరుల ఆక్రమణతో అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల పాలనగా మారింది. ఇక ప్రారంభంలో మహిళలపై, మహిళల హక్కులపై ఎలాంటి ఉల్లంఘన జరగదని తెలిపిన తాలిబన్లు.. వారి పాలన మొదలైన రోజు నుండి మహిళలు హక్కులను అణగారుస్తూనే ఉన్నారు.

Men, women students separated by curtain in Afghan college class under Taliban rule
Men, women students separated by curtain in Afghan college class under Taliban rule

చిన్నపిల్లల దగ్గర్నుండి పెద్దవారి వారకు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పంజ్ షేర్ లోయను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబన్లు కాస్త శాంతించారు. ఇప్పుడిప్పుడే రోజువారి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఆఫీసులు, కాలేజ్ లు తిరిగి ఓపెన్ చేశారు. కొన్ని యూనివర్సిటీల్లో అమ్మాయిలు, అబ్బాయిలు చూసుకోకుడదని తరగతి గదుల్లో పరదాలు కట్టారు. ప్రస్తుత దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.


స్థానిక రిపోర్టర్లు ఈ ఫోటోలను సోషల్ మీడయాలో షేర్ చేసారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించాల్సిన దేశం ముష్కరుల పాలయితే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే చేస్తున్నారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఇంతటి అరాచక స్థాయిలో మరెక్కడా ఉండవని అంటున్నారు ప్రముఖులు. ముఖ్యంగా మహిళల హక్కులకు, గౌరవాన్ని అంతకంతకూ తాలిబన్లు దిగజారుస్తున్నారని చెప్పడానికి ఈ ఒక్క ఫోటో చాలు. తాలిబన్ ఎడ్యూకేషన్ అథారిటీని రీసెంట్ గా ఆదేశాలు జారీ చేశారు.


ఇక ప్రైవేట్ కాలేజ్ లకు వెళ్ళే అమ్మాయిలు ఖచ్చితంగా బుర్ఖా, నిఖాబ్ వేసుకోవాలని, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నిబంధనలు చేశారు. అలాగే అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు గదుల్లో పాఠాలు చెప్పాలని సూచించారు. లేదంటే వారి మధ్య ఇలా పరదాలు వేయాలని ఆదేశించడంతో యూనివర్సిటీ యాజమాన్యం ఇలా చేశారు.


అంతేకాకుండా రానున్న కాలంలో మహిళలకు, మహిళా టీచర్లే క్లాసెస్ చెబుతారని.. పురుషులు, అమ్మాయిలకు టీచింగ్ చేయకూడదని, ఒకవేళ అలా చేయాల్సివస్తే సీనియర్ ఫాకల్టీ మాత్రమే భోదించాలని రూల్స్ పెట్టారు తాలిబన్లు. అలాగే కాలేజ్ పూర్తయ్యాక అందరూ ఒకేసారి బయటకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇలా వెళ్ళేటప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి మాట్లాడుకుంటారని అంటున్నారు.