Viral News : విడ్డూరం : భార్య బాధితుల ఆందోళన, డిమాండ్స్ ఇవే
NQ Staff - February 28, 2023 / 06:33 PM IST

Viral News : భార్యా బాధితుల సంఘం అంటూ అప్పుడప్పుడు మీమ్స్ లలో చూస్తూ ఉంటాం, అయితే నిజంగా భార్య బాధితుల సంఘం అనేది ఉంటుందా అని చాలా మందికి అనుమానం ఉంది. నిజంగానే భార్య బాధితుల సంఘం ఉంది.. ఉండడం మాత్రమే కాదండోయ్ కర్ణాటక రాజధాని బెంగళూరులో భార్య బాధితుల సంఘం యొక్క సభ్యులు రోడ్డుకి రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
నగరానికి చెందిన వందలాది మంది భార్య బాధితుల సంఘం సభ్యులు ఆందోళన చేస్తూ తమ ఆవేదన వెళ్లగక్కారు. గృహ హింస చట్టంలోని లొసుగులు అడ్డు పెట్టుకొని తమ భార్యలు తమపై కక్ష సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్ములను మా ఇంట్లో వారిని భార్యలు వేధిస్తున్నారని విడాకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కొందరు భార్య బాధిత భర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అత్తమామలపై కోడలు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, భర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భార్యలు పెట్టిన కేసుల్లోంచి వృద్ధులైన అత్తమామలను తొలగించాలని అలాగే విడాకులు తీసుకున్న సమయంలో పిల్లలు యొక్క సంరక్షణ బాధ్యత భర్తలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
రెండు రోజుల పాటు జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న భార్య బాధితుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. గృహహింస చట్టంలో మార్పులు తీసుకొచ్చే వరకు తమ యొక్క పోరాటం ఆగదు అంటూ వారు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు.