Megastar Vs Superstar : మెగాస్టార్ వర్సెస్‌ సూపర్‌ స్టార్‌ పోరులో పై చేయి ఎవరిది?

NQ Staff - July 29, 2023 / 07:40 PM IST

Megastar Vs Superstar : మెగాస్టార్ వర్సెస్‌ సూపర్‌ స్టార్‌ పోరులో పై చేయి ఎవరిది?

Megastar Vs Superstar  :

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్ గా నటించింది.

అదే రోజు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా విడుదల కాబోతుంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ సినిమాలో కూడా హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించడం విశేషం.

తెలుగు బాక్సాఫీస్ వద్ద పోటీ…

రెండు సినిమాలు ఒకే రోజున రాబోతున్న నేపథ్యంలో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎవరిది పై చేయి అవుతుంది అనే విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో జోరు మీద ఉన్నాడు. గత చిత్రం వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ రజనీకాంత్ నటించిన సినిమాలేవి ఈ మధ్య కాలంలో సక్సెస్ అవ్వలేదు.

Megastar Vs Superstar

Megastar Vs Superstar

రోబో సినిమా తర్వాత ఆయన నటించిన ఏ ఒక్క సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోయాయి. అందుకే చాలా క్లియర్ గా మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద పై చేయి సాధించడం ఖాయం అంటూ మెగా ఫాన్స్ ధీమాతో ఉన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాతో నైనా కనీసం కలెక్షన్స్ రాబడతాడేమో చూడాలి అంటూ బాక్స్ ఆఫీస్ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us