చిరు కొత్త లుక్ వెనుకాల ఉన్న అసలు నిజం ఇదే

Advertisement

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య సినిమాలకు రీఎంట్రీ ఇచ్చి బిజీ అయిపోయాడు. ఇప్పటికే ఓ సినిమా షూటింగ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే మెగాస్టార్ గతంలో ఎన్నడూ లేని విధంగా గుండు లుక్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఈ పిక్ చూసి చాలా మంది ఏదో మార్ఫింగ్ అని అందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఒకవైపు మీడియాలో.. ఇది చిరంజీవి కొత్త సినిమా లుక్ అని పలు కథనాలు రావడంతో అంత నిజమే కావొచ్చని ఫిక్స్ అయ్యారు. అయితే అందరూ అనుకున్నట్లు ఇది నిజంగా గుండు చేసుకుంది కాదని అసలు సీక్రెట్ ఇదే అని చిరు గుండు కు సంబందించిన ఓ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఈ లుక్ ‘అర్బన్ మాంక్‌’ లుక్ అని చిరంజీవి అసలు నిజం బయట పెట్టాడు. మేకింగ్ ఆఫ్ ద అర్బన్ మాంక్ వీడియో పోస్ట్ చేసి ప్రతి ఒక్కరు నమ్మేలా లుక్‌ని మేకోవర్ చేసే ఇండస్ట్రీలోని ప్రతి టెక్నీషియన్‌కి థ్యాంక్స్‌ అంటూ సినిమా మ్యాజిక్ ‌కి సెల్యూట్‌” అంటూ అభిప్రాయాన్ని షేర్ చేసాడు. ఇక ఈ వీడియో ఆసక్తికరంగా ఉండడంతో మెగా అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here