Megastar Chiranjeevi Participated In Baby Success Meet : బేబీ సక్సెస్ మీట్ లా లేదు.. చిరు అభినందన సభను చేశారేంట్రా బాబు..!

NQ Staff - July 31, 2023 / 10:09 AM IST

Megastar Chiranjeevi Participated In Baby Success Meet : బేబీ సక్సెస్ మీట్ లా లేదు.. చిరు అభినందన సభను చేశారేంట్రా బాబు..!

Megastar Chiranjeevi Participated In Baby Success Meet  :

చిరంజీవి చిన్న సినిమాల సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన బేబీ సక్సెస్ మీట్ కు వచ్చారు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్అయిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. దాంతో మూవీ సక్సెస్ మీట్ ను నిన్న నిర్వహించారు.

అయితే సక్సెస్ మీట్ లో ఆ సినిమాకు పని చేసిన నటీనటులు, దర్శకులు కలిసి తాము పడ్డ కష్టం, సినిమా కోసం ఏమేం చేశామనేది చెప్పుకుంటారు. కానీ ఈ సక్సెస్ మీట్ లో మాత్రం అందరూ చిరంజీవి ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నారు. స్టేజ్ మీదకు వచ్చిన వారు వచ్చినట్టే చిరుకు తాము పెద్ద ఫ్యాన్ అని.. ఆయన సినిమాలను చూసి పెరిగాం అంటూ ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చారు.

మైక్ అందుకున్న తర్వాత..

ఆనంద్, వైష్ణవి, విరాజ్, ఎస్ కే ఎన్, సాయిరాజేష్ ఇలా అందరూ ఇదే పని చేశారు. వాస్తవానికి వారంతా చిరు అభిమానులే. కాబట్టి చిరును ముందు ఉంచుకుని ఆయన్ను పొగడ్డం కామన్. కానీ ఇది కాస్త శృతిమించింది. అందుకే చిరు మైక్ అందుకున్న తర్వాత మొదటగా చెప్పింది.. ఇది సక్సెస్ మీట్ లా లేదు.. నా అభినందన సభలాగా ఉంది అంటూ తెలిపారు.

నా అభిమానులు ఇంత మంచి సక్సెస్ అందుకోవడం తాను గర్విస్తున్నట్టు తెలిపారు. ఇండస్ట్రీలో నన్ను ఆదర్శంగా తీసుకుని పైకి వచ్చే వారిని నేను కచ్చితంగా అభినందిస్తూ ఉంటాను. అందుకే ఈ సక్సెస్ మీట్ కు వచ్చాను. ఇది నా బాధ్యత అని అనుకుంటున్నాను అంటూ తెలిపారు చిరంజీవి.

 

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us