బర్త్ డే రోజు ఫ్యాన్స్ కు కానుక ఇవ్వనున్న చిరంజీవి

Advertisement

మెగా స్టార్ అభిమానులు చిరంజీవి యొక్క 152వ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి ఆచార్య అని టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 22 న చిరంజీవి బర్త్ డే సంధర్బంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను, మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. 22 సాయంత్రం 4 గంటలకు ఈ పోస్టర్ విడుదల చేయనున్నారు.
చిరంజీవి బర్త్ డే కోసం అభిమానులు ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేశారు.

ఆయనకు సంబంధించిన సీడీపీని దేశంలోని 65 మంది ప్రముఖులు విడుదల చేయనున్నారు. ఈ మూవీలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో నటించనున్నారని సమాచారం. అలాగే ఈ మూవీ ఒక గెస్ట్ పాత్రలో రామ్ చరణ్ కూడా నటించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే సీడీపీ వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది ఇప్పుడు చిరంజీవి బర్త్ డే ను అభిమానులు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తారేమో చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here