అన్నయ్యే నాకు స్ఫూర్తి : పవన్ కళ్యాణ్
Admin - August 22, 2020 / 01:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలుపుతూ ఒక ప్రకటన చేసాడు . అయితే చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు పవన్. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగాడు. అలాగే ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు.
అన్నయ్య చిరంజీవి చేయిపట్టి పెరిగానని, ఆయనే నాకు మొదటి గురువు అని పవన్ తెలిపారు. అంచెలంచెలుగా ఎదిగి కొట్లాది మంది అభిమనులు మరియు శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరమైన స్థానాన్ని సంపాదించిన ఒక గొప్ప వ్యక్తి చిరంజీవి అని పొగడ్తల వర్షం కురిపించారు. చిరంజీవి తనకు కేవలం అన్నయ్య మాత్రమే కాదని, దేవుడితో సమానమని వెల్లడిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్.