Megastar Chiranjeevi : నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి.. రవితేజను చిన్న హీరో అంటూ..!
NQ Staff - January 29, 2023 / 02:08 PM IST

Megastar Chiranjeevi : సినీ సెలబ్రిటీలు అంటేనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా స్టేజిపై మాట్లాడుతున్నప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ఏ మాత్రం తేడాగా మాట్లాడినా సరే ట్రోలర్స్ రెడీగా ఉంటారు. ట్రోల్స్ చేయడానికి చిన్న అంశం దొరికినా రెచ్చిపోతుంటారు. మొన్నటికి మొన్న బాలయ్య విషయంలో ఇదే జరిగింది. కాగా ఇప్పుడు చిరంజీవి కూడా ఇలాగే దొరికిపోయాడు.
ఆయన స్టేజిపై మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా, ఎవరూ నొచ్చుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. అయితే తాజాగా ఆయన వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ కాస్త మాట జారాడు. ఈ సినిమాలో ఓ పెద్ద హీరో చిన్న హీరో పోస్టర్‌ను ముద్దాడాడు అంటూ అన్నాడు చిరంజీవి.
రవితేజ చిన్న హీరోనా..?

Megastar Chiranjeevi Insulted Ravi Teja in Waltair Veerayya Success Meet
మరి చిరంజీవి చెప్పిన పెద్ద హీరో ఆయనే అంటే మెగాస్టార్. ఇక చిన్న హీరో అంటే రవితేజ. వాస్తవానికి చిరు ఇలా మాట్లాడుతారని ఎవరూ ఊహించి ఉండరు. రవితేజ అసలు చిన్న హీరోగాన అంటే కానే కాదు. కాబట్టి చిరంజీవి ఇలా మాట్లాడి ఉండకూడదు. ఈ సినిమా కోసం రవితేజకు రూ.17 కోట్లు ఇచ్చారు.
పైగా ఆయన నటించిన ధమాకా సినిమా రూ.100కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇప్పుడున్న అగ్ర హీరోల్లో రవితేజ కూడా ఒకరు. అలాంటి రవితేజను పట్టుకుని చిన్న హీరో అనడంతో రవితేజ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అసలు మల్టీ స్టారర్ సినిమాలు రావడం ఇబ్బందిగా ఉన్న రోజుల్లో చిరంజీవి లాంటి హీరో ఇలాంటి కామెంట్లు చేయడం కరెక్టు కాదని అంటున్నారు నెటిజన్లు.