Megastar Chiranjeevi Had Lot Of Trouble In Industry : పడిపోతున్న చిరంజీవి కెరీర్ ను నిలబెట్టిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..?
NQ Staff - July 11, 2023 / 01:14 PM IST

Megastar Chiranjeevi Had Lot Of Trouble In Industry :
మెగాస్టార్ గా చిరంజీవి ఎదిగిన తీరు ఎవరికైనా ఆదర్శమే. ఒంటరిగా వచ్చి ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు చిరంజీవి. పైగా ఏ సినిమా ఎలా ఉంటే ఆడుతుందో చిరంజీవికి బాగా తెలుసు. అందుకే ఆయన సినిమాలు అంటే మినిమమ్ హిట్ అనే గ్యారెంటీ అప్పట్లో ఉండేది. కానీ ఒకానొక సమయంలో చిరు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు.
ముఖ్యంగా 1995 సంవత్సరంలో చిరు కెరీర్ సంక్షోభంలో పడింది. బిగ్ బాస్, రిక్షావోడు, ఇద్దరు మిత్రులు, సిపాయి, మృగరాజు, దాడి ఇలా వరుసగా మూవీలు ప్లాప్ అవుతూ వచ్చాయి. దాంతో చిరు గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఆయన సినిమాను కొనేందుకు కూడా బయ్యర్లు ముందుకు రాని పరిస్థితి వచ్చింది.
ఇండస్ట్రీ హిట్..

Megastar Chiranjeevi Had Lot Of Trouble In Industry
ఆ సమయంలోనే చిరును ఓ సినిమా మళ్లీ నెంబర్ వన్ పొజీషన్ లో నిలబెట్టింది. అదే ఇంద్ర మూవీ. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ హిట్ కొట్టింది. చిరు గ్రాఫ్ ను అమాంతం పెంచేసింది. ఒక రకంగా ఇది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దెబ్బకు మళ్లీ ఆయనే నెంబర్ వన్ పొజీషన్ కు వచ్చాడు.
ఇందులో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే కలిసి నటించారు. ఫాక్ష్యన్ డ్రాప్ మూవీగా వచ్చిన ఇంద్రలోని ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పించే విధంగానే ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కు పోతుంటారు ప్రేక్షకులు.