రానున్న రోజుల్లో చిరంజీవి బీజేపీలో చేరనున్నారా!
Admin - September 19, 2020 / 06:34 AM IST

సినిమాల్లో తిరుగులేని రాజుగా ఉన్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం చాలా ఘోర పరాజయాన్ని పొందారు. ప్రజలకు సేవ చేయాలని అనుకోని ప్రజారాజ్యం పార్టీని కూడా స్థాపించారు. అయితే చిరంజీవికి సీఎం కుర్చీ మాత్రం దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన చిరు పార్టీని కాంగ్రెస్ విలీనం చేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. అయితే తాజగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తాజాగా చేసిన హాట్ కామెంట్స్ చిరంజీవి రాజకీయ భవిష్యత్తు గురించి కొత్త ఆలోచనలు కలుగజేస్తున్నాయి.

సోము వీర్రాజు పక్కా మెగా ఫ్యామిలీ భక్తుడు అంటూ హర్షకుమార్ ఈ మధ్య కామెంట్స్ చేశారు. ఆయన చిరంజీవి కుటుంబానికి వీర భక్త హనుమాన్ అని కూడా పోల్చారు. చిరంజీవిని సీఎం చేయడం కోసమే సోము వీర్రాజు రాజకీయం చేస్తున్నారు అని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారేమోనని, వస్తే బీజేపీలో చేరుతారేమోనని రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.