Megastar Chiranjeevi Going Act With Ravi Teja In Next Movie : మళ్లీ చిరంజీవితో రవితేజ.. ఇంట్రెస్టింగ్ రూమర్
NQ Staff - July 29, 2023 / 08:20 PM IST

Megastar Chiranjeevi Going Act With Ravi Teja In Next Movie :
టాలీవుడ్ ప్రేక్షకులు మల్టీస్టారర్ సినిమాలను ఎప్పుడూ కూడా ఆదరిస్తూనే ఉంటారు. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే ఆ సినిమా ఎలా ఉన్నా మినిమం సక్సెస్ చేస్తారు అనే విషయం పలు సందర్భాల్లో నిరూపితమైంది.
వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ ఉండడం వల్లే మంచి స్పందన దక్కింది అనేది బాక్సాఫీస్ వర్గాల మాట. అందుకే మెగాస్టార్ చిరంజీవి మరో సారి మాస్ మహారాజా రవితేజ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
బ్రో డాడీ తర్వాత సినిమాలో…
ప్రస్తుతం బ్రో డాడి సినిమా కోసం సిద్దు జొన్నలగడ్డతో కలిసి నటించబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత చేయబోతున్న సినిమాలో రవితేజతో కలిసి నటించబోతున్నాడు. ఆ సినిమా దర్శకుడు ఎవరు? కథ ఏంటి? అనే విషయాలపై క్లారిటీ లేదు. కానీ చిరంజీవి సినిమాలో రవితేజ నటించిన బోతున్నాడు అనేది మాత్రం ఆసక్తికర పుకారు.
ఈ విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవికి రవితేజ లక్కీ చామ్. అందుకే ఆయన్ని మళ్లీ తన సినిమాలో నటింపజేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. మరో వైపు రవితేజ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు.