ధర్మం కోసం కత్తి పట్టిన మెగాస్థార్ : ఆచార్య పోస్టర్ విడుదల

Advertisement

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకొని తన కొత్త సినీమా పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఆయన 152వ సినిమా ‘ఆచార్య’ చిత్ర మోషన్ పోస్టర్‌ విడుదలైన సందర్భంగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో సామాజిక నేపథ్యంలో తెరకెక్కుతున్నఈ సినిమా మోషన్ పోస్టర్‌లో కళ్లకు కట్టినట్టుగా ఎలా ఉంటుందో చూపించారు. అయితే దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన ఆ ప్రభావం సామాన్య ప్రజల మీద ఎలా పడుతుందో చూపించారు అని ఈ పోస్టర్ లో కనిపిస్తుంది.

అలాగే ధర్మస్థలిలో సాధువులు, గ్రామ ప్రజలు నిలబడి ఉండగా, ఎర్ర కండువా మేడలో వేసుకొని కత్తితో శత్రువులపై పోరాడుతున్న చిరంజీవిని ఈ పోస్టర్ లో చూపించారు. ఇక దర్శకుడు కొరటాల శివ ‘ధర్మం కోసం ఒక కామ్రేడ్‌ చేసిన అన్వేషణ’ అంటూ ఈ సందర్భంగా ఓ ట్వీట్‌ చేశారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాదిలో రానుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here