MegaStar Chiranjeevi : వ‌రుణ్ తేజ్ బాడీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌పై చిరంజీవి ప్ర‌శంస‌లు

MegaStar Chiranjeevi : మెగా హీరో వ‌రుణ్ తేజ్ వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్ప‌టికే ఆయ‌న చేసిన చాలా సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. తాజాగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ జంటగా గ‌ని సినిమా రూపొందుతుంది. ఇందులో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నారు.

బాక్సర్ అంటే ఏ రేంజ్‌లో మేకోవర్ అవ్వాలో, బాడీ పరంగా ఎంత ఇంప్రూవ్ కావాలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఒక్క సినిమా కోసం కొన్ని నెలలు వ్యాయామాలు చేసి పర్‌ఫెక్ట్ బాడీతో బాక్సర్‌గా తయారవ్వాలి. వరుణ్ అలాగే తయారయ్యాడు. ఈ సినిమా కోసం తనను తాను ఎంతగా మార్చుకున్నాడో తాజాగా విడుదలైన ‘గని’ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

ఆకలి అందరికీ ఉంటుంది .. ఆశయం కొందరికే ఉంటుంది. ఆశయం ఉన్నవాడే విజయం వైపు పరిగెడతాడు. విజయంపై దృష్టి పెట్టినవాడే విజేతగా నిలుస్తాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో తాను పోషించే బాక్సర్ పాత్ర రియాలిటీకి చాలా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో వరుణ్ తేజ్ విదేశాలకి వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.

ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రచార చిత్రాలతో పాటు వీడియోలు వదులుతూ వెళుతున్నారు. ఇవి సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా అప్ డేట్ లను ఎప్పటికప్పుడు చూస్తున్న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ వరుణ్” అంటూ మెచ్చుకున్నారు.

ఒక పాత్ర కోసం తాను చేసిన హార్డ్ వర్క్ అలాగే ప్యాషన్ ఏంటీ అనేది తెలుస్తుంది”.. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే చిత్ర యూనిట్‌కి, వరుణ్ తేజ్‌కి గని చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.