Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి భలే మంచి విషయాన్ని గుర్తుచేశారు..

Megastar Chiranjeevi: తెలుగు హీరోలందరిలోనూ తానెప్పుడూ ప్రత్యేకమే అని మెగాస్టార్ చిరంజీవి రెగ్యులర్ గా రుజువు చూసుకుంటూ ఉంటారు. పండుగైనా, పబ్బమైనా, సమస్య అయినా, సమాచారం అయినా ఆయన సోషల్ మీడియాలో అప్ టు డేట్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ మంగళవారం మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవి ఒక ముఖ్య విషయాన్ని తన అభిమానులకు, తెలుగు ప్రజలకు గుర్తు చేశారు. ఈ రోజు హనుమజ్జయంతి. మీడియా ఈ విషయానికి పెద్దగా ప్రధాన్యత ఇవ్వలేదు. ప్రజలు కూడా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అందువల్లే అనుకున్న స్థాయిలో ప్రచారం కూడా కరువైంది. ఆ లోటును ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి భర్తీ చేశారు.

సూపర్ మ్యాన్.. లార్డ్ హనుమాన్..

హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్టు పెట్టారు. అందులో అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘నేటి హనుమజ్జయంతికి ఒక ప్రత్యేకత ఉంది. హనుమాన్ మనవాడే అని, మన తిరుమల కొండల్లోనే జన్మించాడని ఆధారాలతో సహా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇటీవలే రుజువు చేసింది. ఎక్కడివాడు, ఎప్పటివాడు అనే విషయాలను పక్కన పెడితే మన గుండెలో కొలువైన సూపర్ మ్యాన్.. లార్డ్ హనుమాన్’’ అని చిరంజీవి చక్కగా రాశారు.  ఈ మ్యాటర్ కి ఒక ఫొటోను కూడా జత చేశారు. తన సతీమణి సురేఖతో కలిసి ఒక హనుమాన్ విగ్రహం వద్ద కూర్చొని తీయించుకున్న ఆ ఇమేజ్ సందర్భోచితంగా ఉందని అభిమానులు అంటున్నారు.

సూపర్.. చిరూ..

సామాజిక స్పృహ విషయంలో చిరంజీవిని మించిన టాలీవుడ్ పర్సనాలిటీ లేదంటే అతిశయోక్తి కాదు. క్రియేటివ్ రైటర్లు గానీ, డైరెక్టర్లు గానీ, యాక్టర్లు గానీ మెగాస్టార్ మాదిరిగా ప్రతి ఈవెంట్ కీ, మూమెంట్ కీ స్పందిస్తుండటం చాలా అరుదు. పొట్టి వీరయ్య లాంటి చిన్న నటులు చనిపోయినా చిరంజీవి రియాక్ట్ అవుతున్నారు. విచారం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్, దేశంలో ఆక్సీజన్ సమస్య వంటి పెద్ద పెద్ద అంశాల్లోనూ యాక్టివ్ గా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అంజనాదేవి పుత్రుడిగా మెగాస్టార్ చిరంజీవి అంజన్న జయంతిని ఆసక్తికరంగా ఫ్యాన్స్ తో పంచుకోవటం అభినందించాల్సిన విషయం.

Advertisement