చిరు బర్త్ డే కోసం కలిసి వస్తున్న 65 మంది స్టార్స్

Advertisement

చిరంజీవికి రికార్డ్స్ క్రియేట్ చేయడం కొత్తేమి కాదు. ఆయన క్రియేట్ చేసిన రికార్డ్ ను ఇంకా ఎవ్వరు టచ్ కూడా చేయలేకపోయారు. చిరంజీవి చేసిన డాన్స్ లు తెలుగు ఆడియన్స్ ను ఎంతలా ప్రభావితం చేశాయంటే ఇండస్ట్రీకి వచ్చే ప్రతి హీరోకి కూడా డాన్స్ బాగా రావాలని ప్రేక్షకులు ఆశించేంతగా ప్రభావితం చేశాయి. చాలామంది హీరోలు యాక్టింగ్ పై కాకుండా డాన్స్ పై ధ్యాస పెట్టిన వారు చాలామంది ఉన్నారు.

ఈనెల 22కు చిరంజీవి 65 సంవత్సరాలు నిండనున్నాయి. ఈ బర్త్ డే సంధర్బంగా చిరు కొత్త రికార్డ్ సృష్టించనున్నారు. 65 సంవత్సరాలు నిండటంతో, 65 మంది సెలెబ్రెటీలు చిరంజీవి యొక్క కామన్ డీపీని విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ఏ హీరో యొక్క సీడీపీని ఇంత మంది సెలెబ్రెటీలు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఇప్పటి వరకు చాలామంది హీరోల సీడీపీలు ట్విట్టర్ లో ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడున్న ఇంతమంది విడుదల చేయనున్న చిరు కామన్ డీపీ ఎన్ని సోషల్ మీడియా రికార్డ్స్ ను బ్రేక్ చేయనుందో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here