Mega Star Chiranjeevi : క్యాన్సర్‌ బారిన పడ్డట్లు వస్తున్న వార్తలపై మెగాస్టార్‌ అసహనం

NQ Staff - June 3, 2023 / 07:28 PM IST

Mega Star Chiranjeevi : క్యాన్సర్‌ బారిన పడ్డట్లు వస్తున్న వార్తలపై మెగాస్టార్‌ అసహనం

Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్టార్‌ క్యాన్సర్‌ సెంటర్‌ ను ఆరంభించిన విషయం తెల్సిందే. ఆ సందర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు కొన్ని సోషల్‌ మీడియా పేజీ ల్లో ఇష్టానుసారంగా రాద్దాంతం చేయడం మొదలు పెట్టారు. క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా ఉండాలంటూ చిరంజీవి సూచించినట్లుగా మాట్లాడారు. కానీ దాన్ని పూర్తిగా మార్చేసి చిరంజీవి క్యాన్సర్ బారిన పడి చికిత్స పొంది చివరకు బాగయ్యారు అంటూ ప్రముఖ ఛానల్స్ లో కూడా స్క్రోలింగ్ వేశారు. దాంతో చిరంజీవి వెంటనే స్పందించాడు. పిచ్చి రాతలపై తీవ్రంగా స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు.

తాను క్యాన్సర్‌ బారిన పడలేదు.. తాను ముందు జాగ్రత్తగా టెస్ట్‌ చేయించుకున్న సమయంలో non – cancerous polyps ని డిటెక్ట్‌ చేయడం జరిగింది. వెంటనే తాను చికిత్స పొంది క్యాన్సర్‌ బారిన పడకుండా జాగ్రత్త పడ్డాను అని మాత్రమే చెప్పాను. కానీ మీడియాలో మాత్రం ఇష్టానుసారంగా కథనాలు వచ్చాయి అంటూ ట్వీట్‌ చేశారు.

చిరు ట్వీట్టర్ లో… కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non – cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. ‘అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమో’ అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని మాత్రమే అన్నాను.

అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో ‘నేను క్యాన్సర్ బారిన పడ్డాను’ అని ‘చికిత్స వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధ పెట్టిన వారవుతారు అంటూ ట్వీట్‌ చేశారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us