Mega Star Chiranjeevi : పాకిజాకు భారీ సాయం ప్రకటించిన చిరంజీవి.. ఎంతంటే…?

NQ Staff - February 2, 2023 / 01:50 PM IST

Mega Star Chiranjeevi : పాకిజాకు భారీ సాయం ప్రకటించిన చిరంజీవి.. ఎంతంటే…?

Mega Star Chiranjeevi : చిరంజీవి అంటే ఎంతో గౌరవ, మర్యాదలు ఉన్నాయి ఇండస్ట్రీలో. ఆయన మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అయితే కెరీర్‌ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా చిరంజీవి ఎంతో మందికి ఎన్నో చేస్తున్నారు. తాను ఇండస్ట్రీ పెద్ద అంటే చిరు ఒప్పుకోరు కానీ.. ఇండస్ట్రీకి ఏ ఆపద వచ్చినా సరే ముందుండి సాయం చేస్తారు.

ఈ విషయాన్ని ఎన్నోసార్లు చిరు నిరూపించు కున్నాడు. అలాంటి చిరంజీవి తాజాగా మరో పెద్ద సాయం ప్రకటించారు. గత కొంత కాలంగా నటి పాకిజా గురించి ఏదో ఒక న్యూస్‌ వినిపిస్తోంది. ఆమె తెలుగు, తమిళంలో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అలాంటి ఆమె పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా తయారైంది.

నాగబాబు కూడా..

కనీసం తినడానికి కూడా తిండి లేని పొజీషన్‌ లో ఉంది పాకిజా. అయితే ఆమె పరిస్థితి గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూ చూసిన సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్‌ నాగబాబు స్పందించారు. ఆమెకు రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు.

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. పాకిజా పరిస్థితి చూసి చలించిపోయారు. ఆమెకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్టు తెలిపాడు. పాకిజాకు అందరూ అండగా నిలవాలాని కోరారు చిరంజీవి. ఆమెకు అవకాశాలు ఇచ్చి మళ్లీ ఆదుకోవాలని కోరారు చిరు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us