మెగాస్టార్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా ! బర్త్ డే స్పెషల్
Admin - August 22, 2020 / 07:54 AM IST

మెగా స్టార్ చిరంజీవి తన సినీ జీవితం చాలా కష్టాల నుండి నేడు ఇంత గొప్ప స్థాయికి వచ్చాడు. అయితే నేడు 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ శుభాకాంక్షలు తెలుపుతూ.. తన జీవిత ప్రయాణం గురించి ఒకసారి తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్. ఇక తన ఇంట్లో వారందరూ శంకరం బాబు అని పిలిచేవారు. మెగాస్టార్ చిరంజీవి 1955 వ సంవత్సరం ఆగష్టు 22వ తేదీన ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగలితురులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి భార్యాభర్తలకు ప్రథమ కుమారుడిగా జన్మించారు. అయితే చిరంజీవికి ఇద్దరు చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు. ఇక సినీ జీవితానికి వెళితే 1978లో పునాది రాళ్లు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా. కాని ప్రాణంఖరీదు అనే సినిమా ముందుగా విడుదల అయ్యింది. అయితే మొదటి సినిమాకి అయన అందుకున్న పారితోషికం కేవలం 1,116 రూపాయలు మాత్రమే. ఇక అలా సినిమాలు చేస్తూ.. 1983 వరకూ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిన చిరంజీవి ఆ తరవాత పూర్తి స్థాయి హీరోగా ఎదిగాడు.
ఇక వివాహ విషయానికి వెళితే చిరంజీవి 1980 ఫిబ్రవరి 20న హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నాడు. ఇక చిరంజీవికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇక 1983లో చిరంజీవి నటించిన ఖైది సినిమా తన స్థాయి అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ సినిమా చిరంజీవికి 62 వ చిత్రం కావడం విశేషం. ఇక ఈ సినిమా ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకి చిరంజీవి లక్ష డెబ్బై అయిదు వేల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఇదే సినిమాని హీరో కృష్ణ హిందీలో రీమేక్ చేశారు. అక్కడ సూపర్ హిట్ అయింది. ఇదే సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. దీనితో చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదు కూడా వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి ఇరువై సంవత్సరాలు అయిన సందర్భంగా తనని అంత గొప్పగా ఆదరించిన అభిమానుల కోసం ఏదైనా చేయాలనీ అనుకున్నడు. ఇక 1998 సంవత్సరంలో చిరంజీవి బ్లడ్ బ్యాక్ ని స్థాపించారు. ఆ తర్వాత ఐ బ్యాంకును కూడా స్థాపించారు.
ఇక రాజకీయ విషయానికి వెళితే 2008 ఆగస్టు 26 న తిరుపతిలో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించారు చిరంజీవి. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికలల్లో 18 స్థానాలని మాత్రమే తన పార్టీ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత పార్టీని 2011సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, తాను కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక ప్రేక్షకుల కోరిక మేరకు 2017 లో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ తరువాత ఖైది నంబర్ 150 సినిమాను తీసాడు. ఈ సినిమాతో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించి ప్రేక్షకుల్లో మరోసారి తన సత్తా చాటాడు. ఇక 2019 లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహ రెడ్డి సినిమాని చేశారు. ఇక ప్రస్తుతం ఆచార్య సినిమాను తీస్తున్నాడు. అయితే రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ గారి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి.