Mega Fans Vs Nandamuri Fans : ఎన్టీఆర్ కు అవార్డు వస్తే రామ్ చరణ్ పై ట్రోల్స్.. మళ్లీ మెగా వర్సెస్ నందమూరి..!

NQ Staff - September 18, 2023 / 12:00 PM IST

Mega Fans Vs Nandamuri Fans : ఎన్టీఆర్ కు అవార్డు వస్తే రామ్ చరణ్ పై ట్రోల్స్.. మళ్లీ మెగా వర్సెస్ నందమూరి..!

Mega Fans Vs Nandamuri Fans :

స్టార్ హీరోల ఫ్యాన్స్ నడుమ ఎప్పుడూ ఏదో ఒక వార్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు నందూమరి జూనియర ఎన్టీఆర్, రమ్ చరణ్ ఫ్యాన్స్ నడుమ మరోసారి ఇలాంటి వార్ నడుస్తోంది. వాస్తవానికి వీరిద్దరు హీరోలుగా త్రిబుల్ ఆర్ మూవీని ప్రకటించిన్పటి నుంచే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ సృష్టించారు. ఇక టీజర్లు, ఫస్ట్ లుక్ లు వచ్చినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. మా హీరోను తక్కువ చేసి చూపిస్తున్నారంటూ రాజమౌళిని ఏకి పారేశారు. అప్పుడు రాజమౌళి కూడా స్వయంగా దీనిపై స్పందించారు.

తాను హీరోలలో ఎవరు ఎవరు తక్కువ అనేది చూడట్లేదని.. ఆ సినిమాలో అవి కేవలం పాత్రలు మాత్రమే అని చెప్పాడు. అయితే ఇటు మెగా ఫ్యాన్స్ మాత్రం రామ్ చరణ్ మెయిన్ హీరో అని.. అందుకే ఆయనకు సినిమాల సింహ భాగం స్క్రీన్ షేర్ దక్కిందని పోస్టులు వైరల్ చేశారు. అప్పటి నుంచే ఇదరువురి అభిమానుల మధ్య ఏదో ఒక విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. వాస్తవానికి ఎన్టీఆర్, రామ్ చరణ్‌ లు మాత్రం తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. కానీ అభిమానులు మాత్రం వారి పని వారు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కు సైమా అవార్డ్ లో భాగంగా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది.

దాంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. సైమా అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో తెలుగు నుంచి రామ్ చరణ్‌, ఎన్టీఆర్ లు త్రిబుల్ సినిమా నుంచి.. నిఖిల్ (కార్తికేయ-2), అడవి శేష్(మేజర్), సిద్దు జొన్నలగడ్డ'(డీజేటిల్లు) పోటీలో ఉన్నారు. త్రిబుల్ ఆర్ సినిమా నుంచి రామ్ చరణ్‌, ఎన్టీఆర్ ఇద్దరూ పోటీలో ఉండటంతో మొదటి నుంచే రచ్చ మొదలైంది. ఎవరికి అవార్డు వస్తే ఆ హీరోనే త్రిబుల్ లో బెస్ట్ అంటూ ఛాలెంజ్ లు మొదలయ్యాయి. అందరూ ఊహించినట్టే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ అవార్డు వచ్చింది. ఇంకేముంది నందమూరి ఫ్యాన్స్ ఆగుతారా..

Mega Fans Vs Nandamuri Fans

Mega Fans Vs Nandamuri Fans

సీన్ లోకి రామ్ చరణ్ ను లాగుతున్నారు. ఇన్ని రోజులు రామ్ చరణ్‌ త్రిబుల్ ఆర్ లో మెయిన్ హీరో అనిచెప్పారు కదా.. ఇప్పుడు చూడండి జూనియర్ ఎన్టీఆర్ కే ఈ అవార్డు వచ్చింది కాబట్టి ఆయనే మెయిన్ హీరో అంటూ ట్రోల్స్ మొదలు పెట్టారు. ఇదే విషయంలోకి మిగతా హీరోలను కూడా లాగుతున్నారు. అయితే మెగా అభిమానులు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి బెస్ట్ యాక్టర్ అవార్డు రామ్ చరణ్‌ కే వచ్చిందని.. కానీ ఆయన జ్వరంత బయటకు రాలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ కు ఇచ్చారని కలరింగ్ ఇస్తున్నారు.

అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా దానికి గట్టిగానే బదులిస్తున్నారు. మొత్తానికి అవార్డుల వేడుక ఇరువురి స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ ను క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. ఈ వార్ కు చెక్ పడాలంటే రామ్ చరణ్‌, ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరు స్పందించాలి. లేదంటే అంతే సంగతి అని అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఇప్పటికేఅల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడంతో రామ్ చరణ్ ను లాగి ట్రోల్స్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ కు రావడంతో మరోసారి ట్రోల్స్ మొదలు పెట్టారు. ఎవరికి అవార్డు వచ్చినా రామ్ చరణ్ ను లాగడం ఏంటో అర్థం కావట్లేదు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us