Varun Lavanya Pre Wedding : మెగా ఫంక్షన్ లో ‘ఆమె’ సందడి.. ఏదో తేడాగా వుందే..

NQ Staff - October 17, 2023 / 05:01 PM IST

Varun Lavanya Pre Wedding : మెగా ఫంక్షన్ లో ‘ఆమె’ సందడి.. ఏదో తేడాగా వుందే..

Varun Lavanya Pre Wedding :

మెగా ఇంట్లో జరిగే ఫంక్షన్ అంటేనే ప్రతీ చిన్న విషయాన్ని గమనిస్తుంటారు అభిమానులు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని చూస్తూ తెగ షేర్ చేస్తుంటారు మెగా కాంపౌండ్ వీరాభిమానులు. తాజాగా వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీటికి మెగా హీరోల క్లోజ్ ఫ్రెండ్స్ , కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. ఇవి ప్రీ వేడుకలే కాబట్టి తమకు దగ్గరి వారిని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. అయితే తాజాగా బయటకొచ్చిన ఫొటోల్లో కొందరు ఉండడంపై సినీ అభిమానుల్లో రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి.

మొన్న జరిగిన పార్టీలోని కొన్ని ఫొటోలను అల్లు శిరీష్ షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మెగా ఫ్యామిలీకి సంబంధించని వారు ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వారిలో యువ కథానాయకుడు నితిన్, ఆయన భార్య ఉన్నారు. నితిన్ కొత్త పెండ్లికొడుకు వరుణ్ కు మాంచి స్నేహితుడు. అందుకే సతీసమేతంగా వచ్చి ఉంటాడు.

ఇక మూడో వ్యక్తి .. హీరోయిన్ రితూ వర్మ. ఈ ఫంక్షన్ లో ఈమె ఎందుకున్నట్టు అని.. నెటిజన్లు తెగ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వారి ట్వీట్లను బట్టి.. ప్రస్తుతం రీతూ వర్మ ఏ మెగా హీరో తోనూ సినిమా చేయడం లేదు. మరి ఎవరి గెస్ట్ గా వచ్చినట్టబ్బా.. అని మేధోమధనం చేస్తున్నారు. అయితే ఓ మెగా హీరోకు రీతూ మాంచి ఫ్రెండ్ అని.. అందుకే ఆమెను ఆహ్వానించినట్లు సమాచారం. అయితే సెలబ్రిటీల ఫొటోలు వస్తే.. వాటిని అణువణువు స్కాన్ చేసే కొందరు జనాలకు పలు డౌట్లు ఎప్పుడూ పుట్టుకొస్తుూనే ఉంటాయి మరి.

అయితే ఇలాంటి ఘటనలు కూడా సినీ జనాలకు కొత్తేం కాదు. ఏదో ఒక ఫంక్షన్ లో హీరోయిన్లు, హీరోల ఒంటరిగా కనపడినా, జంటగా కనపడినా ఏదో ఒక గాసిప్ పుడుతూనే ఉంటుంది. ఆ ఫ్యామిలీ అబ్బాయితో ఆ హీరోయిన్ డేటింగ్ లో ఉందట.. వారి మధ్య ఏదో ఉందట.. అని ఇలా నానా వదంతులు వ్యాపిస్తాయి. అయితే ఇందులో కొన్ని నిజాలు కూడా ఉంటాయి. కొన్ని మాత్రం మాములు దోస్తానా వరకే పరిమితమవుతాయి. ప్రస్తుతం రీతూ వర్మ మెగా ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరు కావడంతో ఈ అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.

అయితే ఒకప్పుడు లావణ్య కూడా మెగా ఫంక్షన్లలో అప్పుడప్పుడూ కనిపడింది కూడా.. ఇప్పుడామె ఆ ఇంటి కోడలు అవుతోంది… ఇలా నెటిజన్లు, సినీ జనాల మదిలో ఏవేవో తమకు తోచినట్టు గాసిప్స్ మొలుస్తూనే ఉన్నాయి. చూడాలి మరి రీతూ సాధారణ గెస్ట్ లాగా వెళ్లిందా.. ఆ ఇంటి హీరోతో మెట్టెలు తొడిగించుకోవాలని వెళ్లిందా..అనేది దానికి కాలమే సమాధానం చెప్తుంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us