మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్

Advertisement

కరోనా రోజురోజుకు దారుణంగా విస్తరిస్తుంది. ఇప్పటికే సామాన్యులనుండి సినీ, రాజకీయ నాయకులూ చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక సినీ ఇండస్ట్రీ విషయానికి వెళ్తే చాలా మంది నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె తాజాగా మెగా ఫ్యామిలీ లోని మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అయితే ఈ విషయాన్ని నాగబాబు బయటకు చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో నాగబాబు ఓ క్లారిటీ ఇచ్చాడు.

అయితే తొందరగా కరోనా నుండి కోలుకొని ప్లాస్మాను దానం చేస్తానని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే నాగబాబు గత కొన్నిరోజులుగా ఓ ఛానల్ ‌లో వచ్చే కామెడీ షోలో పాల్గొంటున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ షో నుండే వైరస్ సోకి ఉండొచ్చని భావిస్తున్నాడు. ఇక ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని నాగబాబు సూచించారు. ఇక ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఒక వైపు ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here