Guntur Karam Movie Second Heroine Update : కొత్త హీరోయిన్ ను పట్టేసిన త్రివిక్రమ్.. ఇక ఆమెకు తిరుగుండదా..?
NQ Staff - June 25, 2023 / 12:54 PM IST

Guntur Karam Movie Second Heroine Update : టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దర్శకుడిగా ఆయనకు తిరుగు లేదు. కేవలం దర్శకుడిగానే కాకుండా ఇతర సినిమాల విషయంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఆయనకు అందరు హీరోలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలతో.
అందుకే త్రివిక్రమ్ దృష్టిలో ఏ హీరోయిన్ అయినా పడితే ఆమె దశ తిరిగిపోతుంది. గతంలో సమంత, పూజాహెగ్డే ఇలాగే స్టార్ హీరోయిన్లు అయ్యారు. అయితే ఇన్ని రోజులు త్రివిక్రమ్ అండతో టాలీవుడ్ లో బడా సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది పూజా. కానీ ఇప్పుడు ఆమెను త్రివిక్రమ్ తన కాంపౌండ్ నుంచి గెంటేశాడు.
ఇప్పటికే సంయుక్తాకు వరుస ఛాన్సులు ఇస్తున్నాడు త్రివిక్రమ్. కాగా ఇప్పుడు మరో మలయాళ భామను తన కాంపౌండ్ లోకి లాక్కున్నాడు. ఆమె ఎవరో కాదు మీనాక్షి చౌదరి. ఇప్పటికే ఖిలాడీ, హిట్-2 సినిమాలతో ఆమె ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు ఆమెను త్రివిక్రమ్ తాను మహేశ్ తో తీస్తున్న గుంటూరు కారం సినిమాలోకి సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నాడు.
మొదట ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాను, సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారు. కానీ తాజాగా పూజాను తీసేసి మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షిని తీసుకున్నారు. మీనాక్షికి త్రివిక్రమ్ ఛాన్స్ ఇవ్వడం అంటే మాటలు కాదు. ఆమె త్రివిక్రమ్ కాంపౌండ్ లో కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం పక్కా అని అంటున్నారు. మరి గురూజా అండతో ఆమె ఏ రేంజ్ కు ఎదుగుతుందో చూడాలి.