Medico Preeti : కులం పేరుతో నా చెల్లిని అవమానించారు.. ప్రీతి సోదరి సంచలన వ్యాఖ్యలు..!
NQ Staff - February 27, 2023 / 01:35 PM IST

Medico Preeti : మెడికో ప్రీతి మరణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి.. తన సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేక మత్తు ఇంజెక్షన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఎంజీఎంలోనే ఆమెకు చికిత్స అందించారు.
ఆ తర్వాత పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఐదు రోజులుగా చికిత్స తీసుకుంటూ ప్రీతి ఆదివారం చనిపోయింది. ఇక ప్రీతి విషయంలో ఆమె చెల్లెలు మొన్న చాలా సీరియస్ గా స్పందించింది. గవర్నర్ తమిళిసై ప్రీతిని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆమె కారులో పూల దండ ఉండటం చూసి.. తన అక్క చనిపోయిందనుకుని ముందే పూల దండ తేవడం ఏంటని అడిగింది.
సీనియర్లు అందరూ కలిసి..
ఇక ప్రీతి చినపోయిన తర్వాత మెడికో ప్రీతి అక్క కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మా చెల్లిని సైఫ్ తో పాటు సీనియర్లు అందరూ కలిసి వేధించారు. ఆమెకు మార్చి మార్చి డ్యూటీలు వేస్తూ చిత్ర హింసలు పెట్టారు. మానసికంగా ఆమెను చాలా మాటలు అన్నారు.
ముఖ్యంగా కులం పేరుతో నా చెల్లెను అవమానించారు. ఆమెను ఒంటరిదాన్ని చేసి మానసికంగా హింసించారు. ఈ విషయాలు మాకు ముందే తెలుసు. కానీ ఇంత దూరం వస్తుందని అనుకోలేదు. ఇది ముమ్మాటికీ హత్యే అని సంచలన ఆరోపణలు చేసింది. ఇక ప్రస్తుతం గిర్ని తండాలో ప్రీతి అంత్యక్రియలు జరుగుతున్నాయి.