Jr NTR : 30 సెకన్లలో రూ.8 కోట్లు సంపాదించిన ఎన్టీఆర్.. ఎలాగంటే…?

NQ Staff - June 12, 2023 / 09:46 AM IST

Jr NTR : 30 సెకన్లలో రూ.8 కోట్లు సంపాదించిన ఎన్టీఆర్.. ఎలాగంటే…?

Jr NTR : ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆయన స్థాయి అమాంతం పెరిగిపోయింది. గ్లోబల్ వైడ్ గా ఆయనకు ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో ఆయన డేట్స్ కోసం బడా డైరెక్టర్లు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ కూడా బడా ప్రాజెక్టులను మాత్రమే ఓకే చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్‌ క్రేజ్ ను వాడుకునేందుకు బడా కంపెనీలు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పేరున్న బడా సంస్థ మెక్ డొనాల్డ్స్ రీసెంట్ గా తమ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టుకుంది. ఇక జూనియర్ తో వారు కేవలం 30 సెకన్ల యాడ్ షూటింగ్ ను కూడా చేయించారు.

ఈ వీడియో కోసం ఏకంగా రూ.8 కోట్లు ఎన్టీఆర్ కు చెల్లించారంట. ఇప్పటి వరకు ఏ పెద్ద హీరో కూడా ఇంత తక్కువ వ్యవధి ఉన్న వీడియోకు ఇంత మొత్తంలో తీసుకోలేదు. దాంతో ఎన్టీఆర్ పేరు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. గతంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లు కూడా ఎన్నో యాడ్స్ చేశారు.

కానీ వారు కేవలం రూ.2 కోట్లకు మించి తీసుకోలేదు. అంతెందుకు బాలీవుడ్ స్టార్లు కూడా కేవలం రూ.5 కోట్లకు మించి ఇప్పటి వరకు ఎవరూ తీసుకోలేదు. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు ఎన్టీఆర్‌ కు నేషనల్ వైడ్ గా ఎంతటి క్రేజ్ ఉందనేది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో అందరి కంటే హైయెస్ట్ యాడ్ రెమ్యూనరేషన్ అని ఫ్యాన్స్ అంటున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us