Maruti Suzuki : మారుతి సుజుకి కార్లకు ఇందనంగా ఆవు పేడ..!
NQ Staff - January 27, 2023 / 04:37 PM IST

Maruti Suzuki : మారుతున్న టెక్నాలజీ తో పాటు మనము మారాలి అనుకుంటూ వ్యాపార సంస్థలు కొత్త మార్పులను తీసుకొస్తూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. వాతావరణ కాలుష్యం అధికంగా అవుతున్న కారణంగా ఇప్పటికే పలు వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రికల్ వెహికల్స్ ని మరియు సీఎన్జీ వెహికల్స్ ని తయారు చేసిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో మారుతి సుజుకి సంస్థ ఆవు పేడతో తయారయ్యే బయోగ్యాస్ ఇంధనంగా కారు నడిచే విధంగా టెక్నాలజీని తీసుకు రాబోతున్నారట. 2030 నాటికి ఆవు పేడ తో తయారయ్యే బయోగ్యాస్ ఇంధనంగా నడిచే కార్లను తీసుకు వచ్చే ఉద్దేశంతో ప్రయోగాలు జరుగుతున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్లను అధికంగా భారతదేశంలో తయారు చేయబోతున్నట్లు కూడా వారు తెలియజేశారు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పశువుల వ్యర్ధాలు ఎక్కువగా లభిస్తున్నాయి. దాంతో భారీ ఎత్తున బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు అని వారు భావిస్తున్నారు. దానిపై దృష్టి పెట్టి ఇప్పుడు మారుతి సుజుకి సంస్థ కొత్త కార్ల తయారీకి ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం భారతదేశ రోడ్లపై తిరుగుతున్న సీఎన్జీ కార్లలో 70% కార్లు మారుతి సుజుకి సంస్థకు చెందినవే కనుక.. భవిష్యత్తులో ఆవు పేడతో తయారయ్యే బయోగ్యాస్ ఇందనాన్ని ఉపయోగించి కూడా మారుతి సుజుకి వారు కార్లను తయారు చేసే అవకాశాలు ఉన్నాయంటూ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీ అయ్యి ఉండి.. ఆవు పేడతో తయారయ్యే బయోగ్యాస్ తో ఆ కార్లు నడిస్తే ఖచ్చితంగా ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.