Marriage: ఎక్కువ వ‌య‌స్సు ఉన్న భార్య‌ల‌ని ఎంపిక చేసుకుంటున్న భ‌ర్త‌లు.. ఎందుకో తెలుసా?

Marriage: ఒక పెళ్లి చేయాలంటే పూర్వం పెద్దలు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకునేవారు. అందులో అమ్మాయి, అబ్బాయికి మధ్య వయసు భేదాన్ని చాలా ముఖ్యంగా చూసేవారు. అబ్బాయికి అమ్మాయికి మధ్య వయసు చాలా గ్యాప్ ఉండేది. దాదాపు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు అబ్బాయిలు, తమ కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలని పెళ్ళి చేసుకుంటున్నారు. మన సెలబ్రిటీలలో కూడ ఎంతో మంది ఇలాంటి జంటలు ఉన్నారు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ కంటే పెద్ద. అలాగే అమృతా సింగ్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ లు వారి కంటే పెద్ద వయసున్న వారినే పెళ్ళి చేసుకున్నారు. అయితే ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కారణాలేంటో చూద్దాం..

పెద్ద వయసున్న భార్యల్ని ఎంచుకోవడంలో భర్తలు ముందుంటున్నారు. ఎందుకంటే.. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రాదు. జీవితాన్ని చాలా ఈజీ గా బ్యాలన్స్ చేసుకుంటారు. ఒకరి మీద ఒకరికి గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఎవరి మీదా గాసిప్స్ ఉండవు. ఏదైనా ఒత్తిడికి.. ఆందోళనకు గురయినా కంట్రోల్ చేసుకోవడం తెలుస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలి అనేది తెలుస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చాలా తెలివిగా.. పెద్దరికం గా సాల్వ్ చేసుకుంటారు. భార్య భర్తల మధ్య దాంపత్య జీవితంలో కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

మహిళలు ఎప్పుడూ దైర్యంగా ఉంటారు. అందులోనూ భర్తల కంటే భార్యలు పెద్దవారైతే.. మరింత స్ట్రాంగ్ గా ఉంటారు. అనవసరమైన గొడవలకు తావు ఉండదు. అలాగే భర్తలకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొత్త విషయాలు నేర్చుకుంటారు. దాంపత్య జీవితంలో.. అటు సామాజికంగా ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటారు. దీంతో పాటు మహిళలకు ఇంట్లో పరిస్థితులను పూర్తిగా అంచనా వేయగలుగుతారు. ఆర్థికంగా బాధ్యత కలిగి ఉంటారు. కాబట్టి ఇల్లు సంతోషంగా ఉంటుంది. పిల్లల పెంపకం, చదువు, కెరీర్ పట్ల.. ముఖ్యంగా వారి భవిష్యత్ గురించి కూడా భార్యలే పూర్తి బాధ్యత తీసుకుంటూ.. భర్తను అమితంగా అభిమానించే వ్యక్తిగా ఉంటారు. ఇంకేముంది ఇలాంటి జంటలు చక్కగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు.