Marriage : లెహంగా బొందుకీ, మూడు ముళ్లకీ సంబంధమేంటబ్బా.!
NQ Staff - November 10, 2022 / 05:43 PM IST

Marriage : పెళ్లిళ్లలో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటాయ్. అది సహజం. అయితే, పెళ్లి వేడుకలో భాగంగా మగ పెళ్లివారు కొనిచ్చిన లెహంగా తనకు నచ్చలేదంటూ ఓ పెళ్లి కూతురు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. ఇది కాస్త విచిత్రమే అనుకోండి.! కానీ, కలికాలం కదా.!
అసలు విషయంలోకి వెళితే, పెళ్లి వేడుకలో భాగంగా వధూ వరుల ఇరు కుటంబ సభ్యులూ బట్టలు ఇచ్చి పుచ్చుకోవడమనేది ఓ సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో భాగంగానే వరుడి తండ్రి వధువు కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన లెహంగాని తనకి నచ్చలేదంటూ తిరస్కరించడంతో వివాహమే రద్దయిన ఘటన తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
లెహంగా నచ్చలేదు.. పెళ్లి క్యాన్సిల్ అంతే.!
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వాల్లో జరిగింది ఈ విచిత్ర ఘటన. పెళ్లి కూతురు లెహంగా నచ్చలేదని చెప్పడంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. పోలీసుల జోక్యం కూడా చేసుకోవల్సి వచ్చింది.
పోలీసుల జోక్యంతో ఎలాగోలా గొడవ సద్దుమనిగింది. హల్ద్వాల్లో నివాసముంటున్న ఓ యువతికి, రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్ 5న వివాహానికి ముహూర్తం నిశ్చయించుకున్నారు.
ముందుగానే పెళ్లి బట్టలు మార్చుకునే సాంప్రాదాయంలో భాగంగా వరుని తండ్రి పంపించిన లెహంగా వధువుకు నచ్చకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది.
పెళ్లి క్యాన్సిల్ చేసుకునేంత వరకూ వచ్చింది. పోలీసుల జోక్యంతో అక్టోబర్ 30న వరుడి కుటుంబ సభ్యులు వధువు కుటుంబానికి లక్ష రూపాయలు తిరిగిచ్చి పెళ్లి రద్దు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.