Mark Jones: బట్టతల ఉందని ఉద్యోగిని తొలగించిన బాస్.. చివరకు తిక్క కుదిరింది
NQ Staff - February 15, 2023 / 09:00 PM IST

Mark Jones : బట్టతల ఉన్న వాళ్లను అదృష్టవంతులు అంటారు, కానీ అతడికి బట్టతల దురదృష్టమయింది. అతడి బట్టతల వల్ల ఏకంగా ఉద్యోగం పోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే యూకే లోని లీడ్స్ లో ఈ సంఘటన జరిగింది.
టాంగో అనే నెట్వర్క్ మొబైల్ ఫోన్ కంపెనీలో మార్క్ జోన్స్ సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నాడు. ఆ కంపెనీ బాస్ ఫిలిప్ ఇటీవల అతడు తన కంపెనీలో 50 సంవత్సరాలు దాటిన బట్టతల ఉన్న వాళ్లను తొలగిస్తున్నట్లుగా ప్రకటించాడు.
ఇదెక్కడి విడ్డూరం నా బట్టతలకు ఉద్యోగానికి సంబంధం ఏంటి అంటూ మార్క్ జోన్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. సేల్స్ డైరెక్టర్ గా సుదీర్ఘ కాలం పని చేసిన తనను కారణం లేకుండా ఉద్యోగం నుండి తొలగించాడంటూ తన బాస్ పై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు.
కోర్టులో ఉద్యోగికి అనుకూలంగా తీర్పు వచ్చింది. సరైన కారణం చూపకుండా ఉద్యోగాన్ని తొలగించినందుకు గాను 71 వేల ఫౌండ్ల నష్ట పరిహారం చెల్లించాలని సూచించింది. మన కరెన్సీలో దాదాపుగా రూ. 71 లక్షల నష్ట పరిహారం ఆ విద్యార్థికి లభించింది. నేను బాస్ ని.. ఏం చేసినా నడుస్తుందని భావించిన బాస్ తల పొగరు తిరిగింది.