KP Chaudhary Drugs Case : డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు హీరోయిన్లు.. అడ్డంగా బుక్కయ్యారుగా..!
NQ Staff - June 24, 2023 / 09:04 AM IST

KP Chaudhary Drugs Case : టాలీవుడ్ ను మరోసారి డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. అప్పట్లో సినీ పెద్దలందరికీ ముచ్చెమటలు పట్టించిన డ్రగ్స్.. ఇప్పుడు మరోసారి కలకలం రేపుతోంది. రజినీకాంత్ నటించిన కబాలి సినిమా నిర్మాత అయిన కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. అయితే ఆయన్ను విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి.
ఆయన ఫోన్ లో చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలతో క్లోజ్ గా దిగిన ఫొటోలను గుర్తించారు. అదే సమయంలో ఆయన ఓ ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లతో వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు కనిపెట్టారు. ఇందులో ఒకరు బిగ్ బాస్ లో పాల్గొన్న తెలుగు హీరోయిన్ కాగా.. మరొకరు ఐటెం సాంగ్స్ తో ఫేమస్ అయిన హీరోయిన్.
కాగా వారిద్దరి పేర్లు మాత్రం ఇప్పటి వరకు పోలీసులు బయట పెట్టలేదు. ఎందుకంటే కేపీ చౌదరి నిర్మాత కాబట్టి హీరోయిన్లతో మాట్లాడారా.. లేదంటే వారు నిజంగానే డ్రగ్స్ కొనుగోలు చేశారా అనేది తెలియాల్సి ఉంది. వారు కచ్చితంగా డ్రగ్స్ కోసమే కేపీ చౌదరితో ఫోన్ మాట్లాడినట్టు నిర్ధారణ అయితే అప్పుడు మాత్రమే వారి పేర్లు బయటకు చెబుతారు పోలీసులు.
ఇప్పటికే అషురెడ్డి పేరు మార్మోగిపోతోంది. కానీ ఆమె మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. నిజానిజాలు బయటకు వస్తాయని అప్పటి వరకు వెయిట్ చేయాలంటూ చెబుతోంది ఈ భామ. చూడాలి మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో.