Eclipse : గ్రహణం.. ఎవరికి శాపం.? ఎవరికి లాభం.?
NQ Staff - November 8, 2022 / 06:36 PM IST

Eclipse : మొన్న సూర్య గ్రహణం.. ఇప్పుడేమో చంద్ర గ్రహణం.! ఇందులో వింతేముంది.? ఎప్పటికప్పుడు గ్రహణాలు వస్తూనే వుంటాయి. కొన్ని పాక్షిక గ్రహణాలు.. కొన్ని సంపూర్ణ గ్రహణాలు.. అంతే తేడా.
భూమి, చంద్రుడు, సూర్యుడు.. ఓ గ్రహం.. ఓ ఉపగ్రహం.. ఓ నక్షత్రం.. వీటి దశ, దిశ కారణంగా గ్రహణాలు ఏర్పడుతున్నాయని సైన్స్ చెబుతోంది. రాహు కేతువుల ప్రభావంతో గ్రహణాలని పెద్దలు చెబుతుంటారు.
తినకూడదా.? తిరగకూడదా.?
గ్రహణ సమయంలో అస్సలు బయట తిరగకూడదనే ప్రచారం ఈసారి గట్టిగా జరిగింది. గతంలో గ్రహణాలకు సంబంధించి చాలా మూఢ నమ్మకాలుండేవి. అందులో గ్రహణం మొర్రి అతి ముఖ్యమైనది. కానీ, ఇప్పుడు విజ్ఞానం పెరిగింది.. చాలామందిలో గ్రహణం మొర్రి పట్ల అవగాహన పెరిగింది.
అయినాగానీ, ఈసారి గ్రహణం పట్ల చాలామందిలో భయాందోళనలు నెలకొన్నాయి. పక్షం రోజుల వ్యవధిలో రెండు గ్రహణాలు అరిష్టమంటూ జరిగిన ప్రచారమే ఇందుకు కారణం.
గ్రహణం సమయంలో తినడమే కాదు, బయట తిరగడం కూడా మంచిది కాదనే భయాలతో చాలామంది ఇళ్ళకే పరిమిత మయ్యారు.
అస్సలు తినకూడదు.. అనడం ఎంత మూర్ఖత్వమో.. గ్రహణం సమయంలో పనిగట్టుకుని.. ప్రచారం కోసం రోడ్డెక్కి అతిగా మేసెయ్యడం కూడా అంతే మూర్ఖత్వం.